బస్సులో రాళ్ళు… దేనికబ్బా!

YS Jagan Andhra Pradesh Roadsఆందోళనకారులు బస్సులపై రాళ్ళు విసిరి అద్దాలు పగలగొట్టినట్లు వార్తలలో విని ఉంటాము కానీ బస్సులో రాళ్ళు పట్టికెళ్ళినట్లు ఎప్పుడూ విని ఉండము. అంటే ఏదో పార్టీ వాళ్ళు తమ ప్రత్యర్దులపై దాడి చేయడానికో లేదా అధికార పార్టీకి చెందిన ఏ నాయకుడు ఇల్లు కట్టుకోవడానికో రాళ్ళను తరలించారనుకొంటే బురదలో కాలువేసినట్లే. ఇంతకీ బస్సులో రాళ్ళు ఎందుకు, ఎవరు, ఎక్కడకి పట్టుకువెళ్ళారంటే ఈ వీడియో చూడాల్సిందే.

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నుంచి విశాఖ జిల్లాలోని తాండవకి వెళ్ళే మార్గంలో ఇటీవల కురుస్తున్న వర్షాలకి ఓ రోడ్డు గోతులమయంగా మారింది. అయితే రోడ్డు ఎలా ఉన్నా, బస్సు కండిషన్ ఎలా ఉన్నా ప్రతీరోజూ ఆదేమార్గంలో ప్రయాణించక తప్పదు. కనుక ఆ బస్సు డ్రైవరు, కండక్టరు కలిసి కొన్ని బండరాళ్ళను బస్సులో వేసుకొని దారిపొడవునా గుంతలుపడిన చోట్ల బస్సును ఆపి వాటిని పేర్చుకొంటూ బస్సుని ముందుకు తీసుకువెళ్లారు.

ADVERTISEMENT

బస్సు డ్రైవరు, కండక్టరూ బస్సులో తెచ్చుకొన్న రాళ్ళను తీసి గోతులపడ్డ బురదరోడ్డులో వరుసగా పేర్చుతుంటే ఓ ప్రయాణీకుడు ఎవరో దానిని తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అయ్యింది. ఆ వీడియో అటు తిరిగి ఇటు తిరిగి టిడిపి చేతికి రావడంతో దానికి వ్యంగ్యంగా “నీ రాళ్ళు నువ్వే తెచ్చుకో… నీ రోడ్లు నువ్వే వేసుకో…” అంటూ ట్వీట్ చేసింది. దాంతోపాటు జగన్ ప్రసంగం, ‘రావాలి జగన్… కావాలి జగన్…’ అంటూ సాగే వైసీపీ పాటను కూడా జోడించడం విశేషం. ఈ వీడియో చూసి తీరాల్సిందే. దానిలో సిఎం జగన్ ప్రసంగం విని తీరాల్సిందే.

ADVERTISEMENT
Latest Stories