ఒక్కోసారి రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు చాలా తెలివిగా మాట్లాడుతున్నామనుకొని ఏదేదో వాగేసి నవ్వుల పాలవుతుంటారు.
తెలంగాణ మంత్రి కొండా సురేఖ నోరు జారినందుకు ఏకంగా వందకోట్ల పరువునష్టం దావా ఎదుర్కొంటున్నారు. అంటే మాట చాలా విలువైనదన్న మాట!
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీడియా సమావేశాలు నిర్వహించని జగన్, ఇప్పుడు సజ్జల రామకృష్ణా రెడ్డిని దూరం పెట్టడంతో తరచూ తాడేపల్లి ప్యాలస్‌లో స్వయంగా మీడియా సమావేశాలు నిర్వహించక తప్పడం లేదు. కానీ ఆయన ఎప్పుడు చంద్రబాబు నాయుడు, ఆయన ప్రభుత్వం గురించి ఎటువంటి విమర్శలు, ఆరోపణలు చేస్తున్నా అవన్నీ తన గురించి, తన పాలన గురించే చెప్పుకొని అందువల్లే తమకీ గతి పట్టిందని స్వయంగా చెప్పుకొంటున్నట్లే అనిపిస్తుంటుంది.
జగన్ మీడియా సమావేశాలలో అవతలి వైపు విలేఖరులు ఎవరో చూపించకుండా మాట్లాడుతుంటారు. ఆ విలేఖరి జగన్ మనసులో మాటలని బయటపెట్టేందుకు అవసరమైన ప్రశ్నలే అడుగుతుంటారు. కనుక అది ఆయన మనసాక్షి అయ్యుండవచ్చు.
తాజా సమావేశంలో, “మీ పార్టీ నేతలందరిపై టిడిపి కూటమి ప్రభుత్వం కేసులు పెడుతూ, ఒకరి తర్వాత మరొకరిని జైలుకి పంపిస్తోంది. ఈ కారణంగా మీ పార్టీ కార్యకర్తలను భయబ్రాంతులకు గురిచేసే కార్యక్రమం ఏమైనా జరుగుతోందని భావిస్తున్నారా?” అని ప్రశ్నించింది జగన్ మనసాక్షి.
దానికి జగన్ చెప్పిన సమాధానం వింటే, తమ పార్టీకి ఎన్నికలలో 11 సీట్లు మాత్రమే ఎందుకు వచ్చాయో పూసగుచ్చి వివరించిన్నట్లనిపిస్తుంది.
ఆయన మాట్లాడుతున్నది చంద్రబాబు నాయుడు గురించే కానీ, తనని తాను విమర్శించుకొని, హెచ్చరించుకుంటున్నట్లే అనిపిస్తుంది. జగన్ ఏం చెప్పారో ఆయన మాటలలోనే…
· నువ్వు తప్పు చేసినప్పుడు నిజాయితీగా నీ తప్పుని ఒప్పుకొని క్షమించమని ప్రజలను కోరాలి.
· నీలో కొద్దో గొప్పో ఆ రకం పరివర్తన కనిపిస్తే ప్రజలలో నీపై సానుకూలత ఏర్పడుతుంది.
· నువ్వు చేసిన తప్పు కనపడకూడదు. ఏ తప్పు చేసినా ఎవరూ మాట్లాడకూడదు. అధికారంలో ఉన్నాను కదా అని ఏ తప్పైనా చేయొచ్చు అని ఇష్టారాజ్యం చేస్తే ప్రజలు తిరగబడతారు.
· ప్రజలు తిరగబడితే సింగిల్ డిజిట్ కూడా రాదు.
అధికారంలో ఉంటే ఏ తప్పయినా చేయవచ్చని అనుకుంటే ఎలా @ncbn ? ఇష్టమొచ్చినట్లు చేస్తే ప్రజలు తిరగబడతారు.. ఆ రోజు నీ పార్టీకి సింగిల్ డిజిట్ కూడా రాని పరిస్థితి వస్తుంది.
–@ysjagan గారు, వైయస్ఆర్సీపీ అధ్యక్షులు#100DaysOfCBNSadistRule pic.twitter.com/Zw7wLRCt4N
— YSR Congress Party (@YSRCParty) October 18, 2024




