పిల్లి శాపాలకు ఉట్టెలు తెగవన్నట్లు, వైసీపీ నేతలు, వారి సొంత మీడియా శాపాలకు కూటమి ప్రభుత్వం కూలిపోదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలే అయ్యింది.
కానీ అప్పుడే వైసీపీ నేతలు, వారి సొంత మీడియా ప్రతీరోజూ కూటమి ప్రభుత్వం పాలన చాలా అధ్వానంగా ఉందని, సిఎం చంద్రబాబు నాయుడుకి పాలన చాతకాక అప్పుడే చేతులెత్తేశారని, హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారంటూ ఆరోపిస్తూ తెగ శాపనార్ధాలు పెడుతున్నారు.
Also Read – సినీ పరిశ్రమలో కొత్త ట్రెండ్స్…. భయపెడుతున్నాయి!
టీడీపీ ప్రతిపకక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్ ప్రభుత్వంపై ఈవిదంగానే విరుచుకుపడింది కదా?అప్పుడు తప్పు కానప్పుడు ఇప్పుడు వైసీపీ విమర్శిస్తే తప్పేలా అవుతుంది? అని ప్రశ్నించేవారున్నారు.
నిజమే! అయితే నాడు జగన్ హయంలో అప్పులు తెచ్చి బటన్ నొక్కి ఆ సొమ్ముని ప్రజలకు పంచడమే కనిపించేది తప్ప ఇప్పటిలా అభివృద్ధి పనులు జరిగేవే కావు. జరిగి ఉంటే నేడు వారికీ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించేందుకు నైతిక హక్కు లభించి ఉండేది.
Also Read – ఎఫ్-1 కేసు: సుప్రీంకోర్టు సింపుల్‌గా తేల్చేసింది!
జగన్ హయంలో అవినీతి, భూకబ్జాలతో ఆగిపోలేదు చివరికి కాకినాడ పోర్టుని కబ్జా చేసి దర్జాగా పేదలకు ఇవ్వాల్సిన రేషన్ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసుకున్నారు కదా?
ఇన్ని అక్రమాలకు పాల్పడినందుకే ప్రజలు జగన్‌ని నిర్ధాక్షిణ్యంగా గద్దె దించేశారు కదా? అది మరిచిపోయి తమ హయాంలో అద్భుతంగా పాలన సాగేదన్నట్లు, చంద్రబాబు నాయుడు హయంలో రాష్ట్రం భ్రష్టు పట్టిపోతోందంటూ విమర్శిస్తుండటం సిగ్గుచేటు.
Also Read – మంచుతో మనకెందుకు లోకేష్ భయ్యా?
ఒకవేళ వారి పార్టీ అధినేత జగన్ నిజంగా మహానీయుడే అయితే అందరూ పార్టీని వీడి టీడీపీ, జనసేనలలో ఎందుకు చేరిపోతున్నట్లు?
అయినా చంద్రబాబు నాయుడు పాలన, అభివృద్ధి పనులు ఏవిదంగా సాగుతున్నాయో కళ్ళకు చాలా స్పష్టంగానే కనబడుతున్నాయి కదా? వైసీపీ వాదిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం భ్రష్టు పత్తిపోతుంటే దానికి ఆయన, కూటమిలో పార్టీలే మూల్యం చెల్లించక తప్పదు కదా?
ఈ విషయం చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు కనుకనే ఈసారి అమరావతి, పోలవరానికి మూడేళ్ళు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏడాది టార్గెట్ పెట్టుకొని పనులు చేయిస్తున్నారు కూడా.
ఇంకా అనేక అభివృద్ధి పనులు, లక్షల కోట్ల పరిశ్రమలకు స్వయంగా ప్రధాని మోడీ శంకుస్థాపన చేయబోతున్నారంటే అర్దం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత వేగంగా పనిచేస్తోందో తెలుస్తూనే ఉంది కదా?
జగన్, వైసీపీ నేతలు తమకు లభించిన ఒక్క ఛాన్స్ విలువ తెలుసుకోలేక దుర్వినియోగం చేసుకొని ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని సిఎం చంద్రబాబు నాయుడుని, కూటమి ప్రభుత్వాన్ని చూసి ఏడుస్తూ ప్రజా సమయాలపై పోరాటాలు అంటే ఇవే అనుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు పాపం.