జగన్ సర్కార్ పరువు తీసేసారా?

సంక్షేమం కోసం మా ప్రభుత్వం అంత ఖర్చు పెడుతోంది, ఇంత ఖర్చు పెడుతోంది అంటూ ‘సాక్షి’ పేపర్ల నిండా యాడ్స్ ఇస్తూ పబ్లిసిటీ చేసుకుంటున్న జగన్ సర్కార్ కు షాక్ ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ఓ నిజాన్ని బయట పెట్టింది.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన పధకం క్రింద ఆంధ్రప్రదేశ్ నిర్మించిన గృహాల సంఖ్యను కేంద్రమంత్రి సాద్వీ నిరంజన్ జ్యోతి రాజ్యసభలో వెల్లడించారు. అసలు విషయం ఏమిటంటే, దీనికి సంబంధించిన ప్రశ్నను వైసీపీ ఎంపీనే అడుగగా, దానికి ప్రతిగా కేంద్ర మంత్రి వివరాలు ఇచ్చారు.

ADVERTISEMENT

2020-21 అలాగే ప్రస్తుతం జరుగుతోన్న 2021-22 సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన గృహాల సంఖ్య అక్షరాలా ‘సున్నా.’ అదేలేండి… కనీసం ఏ ఒక్క ఇంటిని కూడా జగన్ ప్రభుత్వం నిర్మించలేదని ఈ సందర్భంగా మంత్రి వర్యులు తెలిపారు.

సరే గత రెండేళ్ల సంగతి పక్కన పెడితే, అంతకుముందుకున్న ఏడాదిలో అంటే చంద్రబాబు నుండి జగన్ అధికారం తీసుకున్న మొదటి ఏడాదిలో 2019-20లో నిర్మించిన గృహాల సంఖ్య 5. బహుశా చంద్రబాబు హయాంలో అసంపూర్తిగా ఉన్న వాటిని నిర్మించారేమో గానీ, సున్నా అయితే కాలేదు.

అసలు జగన్ సర్కార్ పరువు తీసే విషయం ఏమిటంటే, గత మూడేళ్ళ సంగతులతో పాటుగా చంద్రబాబు హయాంలో ఎన్ని గృహాలు నిర్మాణాలు జరిగాయో కూడా ఈ సందర్భంగా ఉదహరించారు. 2016-17లో 681 ఇల్లుగృహాలు, 2017-18లో 27335 ఇళ్ళు, 2018-19లో 18677 నిర్మాణాలు గావించారని తెలిపారు.

పేదల ప్రభుత్వంగా చాటుకునే జగన్ సర్కార్ పేదల కోసం గత మూడేళ్లలో నిర్మించి ఇచ్చిన గృహాల సంఖ్య 5. అంటే ఏడాదికి సరాసరి ఒకటిన్నర్ర ఇంటి చొప్పున విజయవంతంగా నిర్మించారన్న మాట. ఇక్కడే ఓటీఎస్ పధకం మళ్ళీ హాట్ టాపిక్ అవుతోంది.

ఇంటి రిజిస్ట్రేషన్ కోసం 10 వేలు కట్టమంటూ ప్రజలను అధికారులు వేధిస్తున్న వైనం సోషల్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలలో చూస్తూనే ఉన్నాం. తన హయాంలో కనీసం ఒక్క ఇంటి పంపకం కూడా జరగలేదు గానీ, గత ప్రభుత్వాలు పేదలకు ఉచితంగా ఇచ్చిన గృహాల నుండి ఆదాయం ఆర్జించే కార్యక్రమం చేయడానికి నైతిక హక్కు ఉండాలి కదా అని ప్రతిపక్షాలు చేస్తోన్న విమర్శలకు ఇప్పుడు మరింత బలం చేకూరినట్లయ్యింది. మరి దీనిని జగన్ సర్కార్ ఎలా డిఫెండ్ చేసుకుంటారో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories