క్రిస్మస్ వేడుకల కోసం జగన్ పాదయాత్ర బ్రేక్

YS-Jagan-Padayatra-Updatesమొట్టమొదటి సారిగా విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాను నిర్వహిస్తున్న పాదయాత్రకు స్వల్ప విరామం ప్రకటించారు. ఇప్పటిదాకా కోర్టు పనుల మీద ప్రతి శుక్రవారం బ్రేక్ తీసుకుంటున్న జగన్ తొలిసారిగా తన సొంత అవసరం కోసం విరామం ప్రకటించారు. క్రిస్టియన్ అయిన జగన్ క్రిస్మస్ పర్వదినం సందర్బంగా నేడు పాదయాత్రకు విరామం ప్రకటించారు.

కుటుంబసభ్యులతో కలిసి పండుగ జరుపుకోనున్నారు ఆయన. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్ధనలు చెయ్యబోతున్నారు. ప్రస్తుతం జగన్ పాదయాత్ర అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో కొనసాగుతోంది. 3వేల కిలోమీటర్లు, ఆరునెలల పాటు జగన్ పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ADVERTISEMENT

ఇదిలా ఉండగా మంగళవారం జిల్లాలోని గాండ్లపెంట మండలం వేపరాళ్ల నుంచి జగన్‌ తన పాదయాత్రను కొనసాగించనున్నారు. ఇప్పటిదాకా దాదాపుగా 600 కిలోమీటర్ల మేర నడిచిన జగన్ మొత్తం 3000 కిలోమీటర్లు పూర్తి చెయ్యడానికి మరో 5-6 నెలలు పట్టవచ్చు.

ADVERTISEMENT
Latest Stories