
అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్న చందంగా జగన్ తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అధికారంలో ఉంటే ప్రజాధనాన్ని “దోచుకో…దాచుకో”(దో..దా) అంటూ అరాచకానికి అర్ధం చెప్పే జగన్, ప్రతిపక్షంలో ఉంటే రక్తసంబంధీకులను, పార్టీ కార్యకర్తలను “వాడుకో…వదిలై” (వా..వ) అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు అంటూ సొంత పార్టీ నేతలే జగన్ పై ఆరోపణలు చేస్తున్నారు.
Also Read – యుద్ధం మద్యలో ఈ బేరాలేంటి ట్రంప్ గారు?
తన తండ్రి వైస్ రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో, ఆయన పాలన చూసిన నమ్మకంతో 16 నెలలు జైలుకెళ్ళొచ్చిన జగన్ కోసం వైసీపీ పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు పార్టీ బలోపేతానికి అండగా నిలిచి జగన్ కు బలమయ్యారు పార్టీ కార్యకర్తలు.
అయితే వైసీపీ అధికారంలోకి వచ్చే వరకు పార్టీ కోసం గొడ్డు కష్టం చేసిన వారిని పక్కన పెట్టి తన సొంత కోటరిని నియమించుకుని అధికారం వారికే, పదవులు వారికే అన్న చందంగా వ్యవహరించి జగన్ వాడుకుని వదిలేసారు అనే ఆరోపణ వైసీపీ పార్టీ శ్రేణుల నుండే బలంగా వినపడుతుంది.
Also Read – జైల్లో సౌకర్యాలు లేవు… ఇలా అయితే ఎలా?
అలాగే వైసీపీ గెలుపు కోసం జగన్ కు ముఖ్యమంత్రి పదవి కోసం నాలుగు రోజుల రాజకీయ అనుభవం లేకపోయినా, నాలుగు దశబ్దాల రాజకీయ అనుభవం ఉన్న పార్టీతో తలపడుతూ కాళ్లరిగేలా తిరిగిన చెల్లి వైస్ షర్మిలను, చేతిలో బైబిల్ పట్టుకు ఓట్లడిగిన తల్లి విజలక్ష్మిని కూడా జగన్ తానూ ప్రతిపక్షములో ఉన్నంత కాలం తన రాజకీయ ఎదుగుదల కోసం ‘వా’డుకున్నాడు, ‘వ’దిలేసారు.
ఇక తానూ అధికారంలో ఉన్నప్పుడు ‘దో’చుకో…’దా’చుకో పథకానికి మార్గాలు చూపించిన ప్రభుత్వ ఉన్నతాధికారులను, దాన్ని అమలు చేసిన బ్యూరోక్రాట్స్ లను ప్రతిపక్షంలోకి రాగానే ఈ ‘వా..వ’ సిద్ధాంతంతో జగన్ వదిలించుకుంటారు అనేది ఇప్పటికే రుజువయ్యింది. దాన్ని ఫలితాలు కూడా సమాజం చూస్తూనే ఉంది. అప్పటి శ్రీలక్ష్మి నుండి ఇప్పటి విశాల్ గున్నా వరకు అందరికి ఒకే సమ న్యాయం చేసారు జగన్.
Also Read – వైసీపీ రాజకీయాలు మారాయి… మరి టీడీపీ?
అయితే జగన్ చేతికి అధికారం చిక్కితే మాత్రం ఆ దోపిడీ విలువలు లక్ష కోట్ల పై మాటనే అనేది తన తండ్రి వైస్సార్ ప్రభుత్వంలో చేసి చూపించారు. తన తండ్రి ముఖ్యమంత్రి అయితేనే ఇన్ని కోట్ల అవినీతి మరకలు అంటించుకున్న జగన్, ఇక తానే సర్వం అని భావిస్తే ఇక”దోచుకో దాచుకో” లెక్క తేల్చడం 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న చంద్రబాబు వల్లే సాధ్యం కావడం లేదు.
జగన్ వాడుకో వదిలై పథకంలో ఒక్క షర్మిల, విజయలక్ష్మి మాత్రమే కాదు వైస్ వివేకా, ఆయన కుమార్తె సునీత తో పాటుగా పార్టీ కష్టంలో ఉన్నప్పుడు తమ భుజం కాసిన బాలినేని, కోటం రెడ్డి, వాసిరెడ్డి పద్మ…ఇలా ఎందరో నేతలు అధికారికంగా ఈ పథకానికి బలైతే శ్రీ రెడ్డి, బోరుగడ్డ, పోసాని, ఆర్జీవీ వంటి వారు ఇందులో పరోక్ష బాధితులు.
దోచుకో…దాచుకో పథకం కింద ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని జగన్ పిల్లలకు అందించే పాల దగ్గర నుండి, పెద్దలు తాగే మద్యం వరకు దేన్నీ వదిలి పెట్టలేదు. ఇసుక, మైనింగ్, భూ దందాలు, పిల్లలకు ఇచ్చే టాబ్లు ఇలా ఈ పథకం కింద జగన్ పోగేసిన మొత్తం దాచుకోవడానికే విశాఖ రుషికొండ మీద పాలస్ నిర్మించుకున్నారా అనేంతలా గత ఐదేళ్లలో ఏపీ ఖజానాతో పాటు ప్రకృతి సంపన్నుకి దోచేశారు జగన్ అండ్ కో.