
ఈరోజు ఉదయం ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. టిడిపి, జనసేన, బీజేపీ సభ్యులు చాలా సంతోషంగా ఉత్సాహంగా శాసనసభ ప్రధాన ద్వారంలో నుంచి లోనికి అడుగుపెడితే, జగన్ శాసనసభ వెనక ద్వారంలో నుంచి తన ఛాంబర్ చేరుకున్నారు.
Also Read – వన్ నేషన్…వన్ ఎలక్షన్…వన్ పార్టీ.?
జగన్ ఇదివరకు సీడ్ యాక్సస్ రోడ్డులో మందడం మీదుగా శాసనసభకు వచ్చేవారు. అప్పుడు ఆయన వెంట పెద్ద కాన్వాయ్ ఉండేది. కనుక అప్పుడు రోడ్డు పక్కన ఆందోళన చేస్తున్న అమరావతి రైతులను చూసి వెకిలి నవ్వులు నవ్వుతూ దర్జాగా శాసనసభకు చేరుకునేవారు.
కానీ ఇప్పుడు అంత సీన్ లేదు కనుక ఆ మార్గంలో వస్తే దారిలో రైతులు తనని అడ్డుకొని అవమానిస్తారనే భయంతో వేరే మార్గంలో శాసనసభకు చేరుకున్నారు.
Also Read – తగలబడినవి ఆ దస్త్రాలేనా?
శాసనసభ వద్దకు చేరుకున్నప్పుడు బయట ఉన్న కొందరు యువకులు ‘జగన్ మావయ్యా… జగన్ మావయ్యా…’ అంటూ ర్యాగింగ్ చేశారు.
టిడిపి, జనసేన, బీజేపీల సభ్యులు అందరూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారాలు చేస్తుంటే చూడాలని ఉత్సాహంగా ఎదురుచూస్తున్న ఎమ్మెల్యేలు వారు ప్రమాణ స్వీకారాలు చేయగానే బల్లలు చరిచి అభినందనలు తెలియజేశారు.
Also Read – వైసీపీ కి ఆ అర్హత ఉందా.? కానీ జనసేన బాధ్యత..!
కానీ జగన్ తన వంతు వచ్చేవరకు ఛాంబర్‌లో కూర్చోవడంతో శాసనసభలో వైసీపి ఎమ్మెల్యేలు ఆయన కోసం బిక్కుబిక్కుమని ఎదురుచూస్తూ ఆయన లోనికి రాగానే హమ్మయ్య అని నిట్టూర్పు విడిచారు.
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎంతో ధీమాగా ఆత్మవిశ్వాసంతో ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారాలు చేయగా జగన్ ప్రమాణస్వీకారం చేసేటప్పుడు తన పేరు కూడా సరిగ్గా ఉచ్చరించలేక తడబడుతూ ప్రమాణ స్వీకారం చేసి వెంటనే మళ్ళీ తన ఛాంబర్‌లోకి వెళ్ళిపోయారు.
ఆనాడు ఇదే శాసనసభలో జగన్మోహన్ రెడ్డి, వైసీపి ఎమ్మెల్యేలు తల బిరుసుతో వ్యవహరిస్తూ చంద్రబాబు నాయుడుని చాలా దారుణంగా అవమానించారు.
కానీ నేడు అదే శాసనసభలోకి భయపడుతూ ప్రవేశించి, తడబడుతూ ప్రమాణస్వీకారం చేయడం, బయటకు పారిపోవడం చూస్తే ఖర్మ ఫలం అంటే ఇదే కదా?చేసిన పాపాలకు ఇక్కడే శిక్ష, ప్రాయశ్చిత్తం చేసుకోక తప్పదు కదా… అనిపిస్తుంది.
ఓటమి ఎంత దుర్మార్గమైంది అంటే
సొంత పేరు కూడా తప్పు పలికేంత!
మాజీ ముఖ్యమంత్రి గా జగన్ ప్రయాణం ఎన్ని పొరపాట్లో తో సాగుతుందో అనే దానికి…#YSJagan pic.twitter.com/UIcvyKqlj4
— M9 NEWS (@M9News_) June 21, 2024