ఏ రాష్ట్రంలోనైనా అధికారంలో ఉన్న పార్టీలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంటాయి. కానీ ఏపీలో మాత్రం వైసీపీ చేస్తుంటుంది.
ఇందుకు తాజా ఉదాహరణగా తిరుపతి తొక్కిసలాటపై జగన్ నిన్న ఆడిన డ్రామాలు, వైసీపీ నేతలు ప్రేలాపనలు కనిపిస్తున్నాయి.
Also Read – ఆర్జీవీ…’మెగా’ సెటైర్స్..!
వైసీపీకి డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం ఏమిటి? అంటే చెప్పుకోవడానికి చాలానే ఉంది.
కాకినాడ పోర్టు కబ్జా, పోర్టు నుంచి యధేచ్చగా లక్షల టన్నుల రేషన్ బియ్యం విదేశాలకు అక్రమ రవాణా, పేర్ని నాని గోదాములలో నుంచి 7,000కి పైగా రేషన్ బియ్యం బస్తాలు మాయం అవడం, వైసీపీ నేతల రాజీనామాలు, వైసీపీ నేతలపై కేసులు, జగన్ పోర్టు కేసు వగైరా చాలానే ఉన్నాయి.
Also Read – కౌశిక్ రెడ్డి…పార్టీ కోసమా..? పేరు కోసమా.?
ముఖ్యంగా కాకినాడ పోర్టు భాగోతం, పేర్ని నాని గోదాములలో బియ్యం దొంగతనం బయటపడినప్పటి నుంచి ప్రజల ముందు తలెత్తుకోలేకపోతున్నారు.
పైగా మొన్న ప్రధాని మోడీ విశాఖకు వచ్చి రూ.2 లక్షల కోట్లు విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఈ ఘటన జరుగకపోయి ఉంటే కూటమి ప్రభుత్వం తప్పక వాటి గురించి గొప్పగా చెప్పుకొని ఉండేది. కూటమి ప్రభుత్వం ప్రతిష్ట మరింత పెరిగి ఉండేది. కానీ వారి దూరదృష్టమో జగన్ అదృష్టమో కానీ తిరుపతి ఘటన జరిగింది.
Also Read – ఈ ఏడాది ఏపీకి అంతా శుభం… పండుగ చేసుకోవలసిందే!
ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం చర్యలు చేపట్టేందుకు కొంత సమయం ఇవ్వాలి. కానీ ఇటువంటి అవకాశం కొరకే ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు లక్ష్మీ పార్వతితో సహా వైసీపీ నేతలందరూ మూకుమ్మడిగా సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వంపై విమర్శలు మొదలుపెట్టేశారు.
ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు తప్పనిసరిగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి రావాలనే నియమం ఏమీ లేదు. కానీ వారిరువురు వచ్చారు.
వారి కంటే ముందే మంత్రుల బృందం అక్కడకు చేరుకొని పరిస్థితిని సమీక్షించింది. సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఇద్దరూ వచ్చి బాధితులను పరామర్శించి, బాధ్యులపై చర్యలు తీసుకున్నారు. తక్షణమే నష్టపరిహారం రూ.25 లక్షలు ప్రకటించారు.
ఓ అవాంఛనీయ ఘటన జరిగిపోయిన తర్వాత ఏ ప్రభుత్వమైనా ఈవిదంగానే వ్యవహరిస్తుందని అందరికీ తెలుసు.
కానీ ఏడు నెలలుగా తాడేపల్లి ప్యాలస్‌లో నుంచి బయటకు రాకుండా కాలక్షేపం చేస్తున్న జగన్ రాష్ట్రంలో ఎక్కడైనా ఇటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగి, శవాలు లేస్తే వెంటనే ఉరుకుల పరుగులతో అక్కడికి చేరుకుంటారు. వెంటనే శవ రాజకీయాలు మొదలుపెట్టేస్తుంటారు.
తాను పరమర్శకు బయలుదేరాననే కనీస ఇంగితం కూడా లేకుండా దారి పొడవునా కార్యకర్తలతో జేజేలు పలికించుకుంటారు. వారితో సెల్ఫీలు తీసుకుంటారు. డజన్ల మందిని వెంట బెట్టుకొని ఆస్పత్రిలో నేరుగా రోగుల వద్దకు వచ్చేసి మళ్ళీ అక్కడా వారితో ఫోటోలు దిగేందుకే ప్రాధాన్యం ఇస్తారు.
ఎలాగూ సొంత మీడియా ఉంది కనుక కాకినాడ పోర్టు, రేషన్ బియ్యం కధలని జనాలు మరిచిపోయేలా ఈ విషాద ఘటన గురించి పుంఖానుపుంకాలుగా అచ్చచేసుకుంటారు. మరోపక్క బియ్యం దొంగలతో సహా వైసీపీ నేతలందరూ సోషల్ మీడియాలో దీని గురించి పోస్టులు పెట్టేస్తుంటారు. ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ కావా?