ys-jagan-vizag-bay-park-kakinada-project

వైసీపీలో ఎవరి ‘ట్రాక్ రికార్డ్’ చూసినా ఇంచుమించు ఒకేలా కనిపిస్తుండటం ఆశ్చర్యకరమే. మాజీ మంత్రి జోగి రమేష్ ఆధ్వర్యంలో వైసీపీ గూండాలు చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి చేసినందుకు కేసులు ఎదుర్కొంటున్నారు.

Also Read – ఆర్జీవీ…’మెగా’ సెటైర్స్..!

టీడీపీ కార్యాలయంపై దాడి చేసినందుకు ఇప్పటికే వంశీ అనుచరులు జైల్లో ఊచలు లెక్కపెడుతుండగా, ఇప్పుడు కొడాలి నాని ప్రధాన అనుచరుడు మెరుగుమాల కాళిని కూడా పోలీసులు అస్సాంలో అరెస్ట్‌ చేసి తీసుకువచ్చి నెల్లూరు జైల్లో వేశారు.

టీడీపీ కార్యాలయంపై వంశీ, కొడాలి నాని అనుమతి, ఆదేశం, ప్రోత్సాహం లేనిదే వారి అనుచరులు దాడులు చేయరు. కనుక వల్లభనేని వంశీ, కొడాలి నాని మెడకు కూడా ఈ కేసుల ఉచ్చు బిగుసుకోబోతోంది.

Also Read – అప్పుడు సంబరాలు..ఇపుడు సందేశాలు..!

రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని అండ్ ఫ్యామిలీ, ఆ రేషన్ బియ్యం ఎగుమతి కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర రావు, కాకినాడ పోర్టు కబ్జా కేసులో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, ఎంపీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, అరబిందో అధినేత శరత్ చంద్రారెడ్డిల పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా విశాఖలో ఋషికొండపై ‘బేపార్క్ రిసార్ట్’ కబ్జా భాగోతం బయటపడింది.

వందల కోట్లు విలువగల 33.75 ఎకరాల విస్తీర్ణంలో గల బేపార్క్ రిసార్ట్ ప్రాజెక్టు 33 ఏళ్ళ లీజుపై కొనసాగుతుండగా, దానిని జగన్‌ ప్రభుత్వం గుట్టుగా 90 ఏళ్ళకు పొడిగించేసి, సదరు ప్రాజెక్ట్ యజమానిపై ఒత్తిడి చేసి ప్రభుత్వానికి తిరిగి అప్పగించేలా చేసిన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వైసీపీ నేతలకు దానిని కట్టబెట్టిన్నట్లు తెలుస్తోంది.

Also Read – కేటీఆర్‌.. ఈ సంక్రాంతి పండుగ ఇంట్లోనే…

వేలకోట్లు విలువైన కాకినాడ సీపోర్టులో వాటాలను వందల కోట్లు ముట్టజెప్పి వైసీపీ నేతలు ఏవిదంగా దక్కించుకున్నారో, సరిగ్గా అదే ఫార్ములాతో విశాఖలో బేపార్క్ రిసార్ట్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

కనుక వైసీపీలో ఎవరూ ఎవరికీ తీసిపోరని, ఎవరి ట్రాక్ రికార్డ్ వారిదేనని స్పష్టమవుతోంది. కూటమి ప్రభుత్వం అలా పైపైన ఫైల్స్ తిరగేసి చూస్తేనే ఇన్ని భాగోతాలు బయటపడ్డాయి. కాస్త లోతుగా పరిశీలిస్తే ఇంకెన్ని బయటపడతాయో?




అసలు వైసీపీ నేతల అవినీతిని కనిపెట్టి, దర్యాప్తు జరిపేందుకు, ఆ కేసులను నడిపించేందుకు, కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ మంత్రిత్వ శాఖని, పోలీస్, న్యాయ విభాగాన్ని ఏర్పాటు చేసుకుంటే మంచిదేమో? లేకుంటే వైసీపీ నేతల అవినీతి ఊటబావిలా ఊరుతూనే ఉంటుంది. దాన్ని తోడి పోసేందుకే కూటమి ప్రభుత్వం పుణ్యకాలం అంతా సరిపోతుంది.