‘బాణం’తో భేరమా..?

jagan sharmila

“వైస్ కుటుంబ కథ చిత్రం” ఈ రాజకీయ చిత్రంలో హీరో, విలన్ ఎప్పటికప్పుడు తమ పాత్రలను మార్చుకుంటూ ఉంటారు కానీ ఈ సినిమాలో కమిడీయన్స్ మాత్రం ఎప్పుడు తెలుగు ప్రజలే కావడం ఇక్కడ దౌర్భాగ్యం.

ADVERTISEMENT

“రావాలి జగన్ కావాలి జగన్” అంటూ అన్న వదిలిన బాణంగా షర్మిల, తండ్రి లేని బిడ్డకు న్యాయం చేయండి అంటూ విజయలక్ష్మి, ఒక్క ఛాన్స్ అంటూ వైస్ జగన్ ఇలా వైస్సార్ కుటుంబీకులంతా కలసి 2019 ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేస్తూ సోనియా కుటుంబం మీద ఆరోపణలు చేస్తూ టీడీపీ కి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం చేసారు.

దాని ఫలితమే 2019 లో 151 సీట్లతో వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. అనుకున్న లక్ష్యాన్ని అందుకోవడంతో వైస్సార్ కుటుంబ కథ చిత్రం అనే పొలిటికల్ మూవీ కి ఇక ఇక్కడితో ఎండ్ కార్డు పడినట్టే అనుకున్నవారికి జగన్ భారీ ట్విస్ట్ తో ఈ ఘట్టాన్ని ఇంటర్వెల్ సీన్ గా మార్చేశారు.

ఇక ఇక్కడి నుండి వైస్సార్ కుటుంబంలోని అతంర్గత రాజకీయాలు బహిర్గతం అయ్యాయి. పదవి కాంక్షలు కావచ్చు, అభద్రతా భావం కావచ్చు, ఆస్తుల పంపకాలు కావచ్చు జగన్, షర్మిల మధ్య 2024 ఎన్నికలలో మాటల యుద్ధమే నడిచింది. 2019 లో జగన్ విజయానికి కారణమైన వారే 2024 లో జగన్ పతనాన్ని కాంక్షించే స్థాయికి వీరి కుటుంబంలో వివాదాలు వార్తలకెక్కాయి.

అయితే ఈ వైస్ కుటుంబంలో ఏర్పడిన ఈ వివాదాన్ని మొట్టమొదటిసారిగా బయట ప్రపంచానికి తెలియచేసిన ABN ఇప్పుడు తాజాగా మరో రాయ’భేరాన్ని’ బయటపెట్టింది. షర్మిల కోరిన విధంగా ఆస్తులలో వాటా ఇవ్వడానికి జగన్ అంగీకరించారని, దానికి ప్రతిగా కాంగ్రెస్, వైస్సార్ కాంగ్రెస్ ల మధ్య రాజీ రాజకీయం నడపాల్సిన బాధ్యత షర్మిళదే అనే షరతులు విధించారంటూ ABN మీడియాలో వార్తలు ప్రచారమవుతున్నాయి.

వైసీపీ ఓటమితో జగన్ కు కుటుంబ అండ ఎంత అవసరమో తెలిసిచ్చిందని, ఆస్తిలో వాటా కన్నా, రాష్ట్రంలో అధికారమే ముఖ్యం అనే స్థాయికి జగన్ ఆలోచన చేరిందంటూ ABN లో కథనాలు మొదలయ్యాయి. అయితే బెంగుళూర్ వేదికగా ఈ రాజీ రాయభేరానికి వైస్ కుటుంబం చర్చలు జరుపుతున్నట్టు, దాదాపు ఇరు వర్గాల మధ్య రాజీ భేరం కుదిరిందని ABN వార్త పత్రికలో వెల్లడించారు.

అయితే మొన్నటిదాకా కాంగ్రెస్ మీద నిందలు వేసి బీజేపీకి పరోక్ష మిత్రుడిగా కొనసాగిన జగన్, పసుపు చీర కట్టుకున్నావ్ నువ్వు బాబు మనిషివే షర్మిల ‘శాస్త్రి’ అంటూ సొంత సాక్షిలో క థనాలు ప్రచారం చేసిన జగన్ ‘రెడ్డి’ ఇప్పుడు మళ్ళీ తన సొంత గూటికి చేరుకోనున్నారా.? అంటే జగన్ చెప్పే విలువలు విశ్వసనీయత బహుశా ఇవేనేమో.

అయితే ABN లో ఈ కథనాలు చూసిన వారంతా జ ‘గన్’ తో ‘బాణం’ భేరమా.? అంటూ అన్నా చెల్లెళ్ళ రాజీ చర్చలు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కి వ్యతిరేకంగా జగన్ కాంగ్రెస్ కు మిత్ర పక్షంగా దగ్గరయ్యే సాహసం చెయ్యగలుగుతారా.? అనే సందేహం కూడా అందరిమదిలో మెతులుతుంది.

అయితే తన పదవి కాంక్ష కోసం ఎవరితో అయినా అనధికార పొత్తులు పెట్టుకోవడం జగన్ కు కొత్తేమి కాదుగా అనేవారు లేకపోలేదు. ‘నిప్పు లేనిదే పొగ రాదుగా’ అనే సామెత కూడా ఈ రాయభేరానికి సరిగ్గా సరిపోతుంది.

ADVERTISEMENT
Latest Stories