అభివృద్ధి ఉంటే జగన్ ఉండడు., జగన్ ఉంటే అభివృద్ధి ఉండదు..!

YS Jagan- zero Developmentతెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రప్రదేశ్ గా ప్రపంచానికి పరిచయం చేసాం. సింగపూర్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలే ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చేలా అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రణాళికలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి పట్ల తెలుగుదేశం పార్టీకి., సీఎంగా చంద్రబాబుకున్న అంకితభావం అదంటూ వైసీపీ నాయకులపై టీడీపీ నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

‘అభివృద్ధినే’ ఆయుధంగా ఎంచుకున్న పార్టీ టీడీపీ పార్టీ అంటూనే “అభివృద్ధి ఉన్నచోట జగన్ ఉండలేడు., జగన్ ఉన్నచోట అభివృద్ధి చేయలేడు” అంటూ తమదైన స్టైల్ లో పంచ్ లు పేలుస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. అందుకు ఉదాహరణగా రాజధాని ప్రాంత గ్రామాలనే ఎంచుకున్నారు.

ADVERTISEMENT

ముఖ్యమంత్రి నివాసం ఉంటోన్న తాడేపల్లి ప్యాలెస్ కు అత్యంత చేరువలో రాజధానిగా ఎంపిక చేయబడిన మందడం.,తుళ్లూరు., ఉద్దండరాయునిపాలెం వంటి గ్రామాలు ఒక వెలుగు వెలిగిన ప్రాంతాలు, కానీ అది సీఎంగా జగన్ అడుగు పెట్టనంత వరకు మాత్రమే!

ఆరు లైన్ రోడ్ల నిర్మాణం., హైకోర్టు., ఇప్పుడు మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టిన అసెంబ్లీ., ప్రభుత్వ భవనాలు ఇలా ఎంతో అభివృద్ధిని నాటి చంద్రబాబు హయాంలో కళ్ళ ముందు చూసిన రాజధాని గ్రామస్తులు, ఇప్పుడు వేసిన రోడ్లను తవ్వడానికి వస్తున్న క్రేయిన్స్ ని చూడాల్సి రావడం అత్యంత దారుణం అంటూ జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు స్థానికులు.

అభివృద్ధిని కాంక్షించలేని ఇటువంటి ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం గురించి ఉపన్యాసాలు ఇవ్వడం అత్యంత శోచనీయం అంటూ ప్రతిపక్ష పార్టీలతో పాటు స్థానికులు గొంతు కలిపారు. రాష్ట్ర అభివృద్ధే ప్రజల సంక్షేమం.,అది గుర్తించలేని ప్రభుత్వాలకు అరాచకాలు – అక్రమాలు – అవినీతి తప్ప మరో దాని గురించి పట్టదు అని ఏపీ ప్రతిపక్షాలకు తోడు ప్రజలు కూడా రోడ్ల మీదకు వచ్చి నిరసనలు చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories