
జగన్- తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల మద్య హటాత్తుగా ఆస్తుల పంపకాల గొడవ రచ్చకెక్కడంతో అవి ఏవిదంగా సాగుతాయో అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ వివాదం రచ్చకెక్కడంతో ఎక్కువగా నష్టపోయేది జగన్, వైసీపీయే.
తల్లిని, చెల్లికి ఆస్తులు ఇవ్వకపోగా ఇద్దరినీ కోర్టుకీడ్చారనే చెడ్డపేరు ఆయన రాజకీయ జీవితంపై ఎంతో కొంత ప్రభావం చూపుతుంది. ఇదివరకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌ల వ్యక్తిగత జీవితాలను, వారి కుటుంబాలను విమర్శించిన జగన్‌ని ఇప్పుడు వారు కూడా వేలెత్తి చూపేందుకు అవకాశం కల్పించుకున్నారు.
Also Read – రష్మిక నక్క తోక తొక్కారా.?
అయితే ఈ ఆస్తుల పంపకాల గొడవలు హైలైట్ అవుతున్నందున వాటితో ముడిపడున్న అవినీతి కధలు, కోర్టు కేసులు, విచారణలు అన్నీ వెలుగులోకి తప్పక వస్తాయి.
సరస్వతి, భారతి, సాక్షి తదితర కంపెనీలన్నీ పిత్రార్జిత ఆస్తుల ద్వారా జగన్ ఏర్పాటు చేసుకున్నవే అని విజయమ్మ, షర్మిల వ్రాసిన తాజా లేఖలో పేర్కొన్నారు.
Also Read – అది ప్రమాదమట.. కేసు నమోదు చేయడం కుట్రట!
నిజానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేవరకు అంటే 2004 వరకు వైఎస్ కుటుంబానికి ఈ కంపెనీలు, మీడియా సంస్థలు ఏవీ లేవు.
ఆయన హయాంలోనే ‘క్విడ్ ప్రో’ పద్దతిలో జగన్ వాటన్నిటినీ సమకూర్చుకున్నారని సీబీఐ జేడీ లక్ష్మినారాయణ 11 చార్జ్ షీట్స్ దాఖలు చేశారు. ఆ కేసులలో ఏ-1, ఏ-2లుగా ఉన్న జగన్, విజయసాయి రెడ్డితో సహా వారికి తోడ్పడిన లేదా వారితో చేతులు కలిపిన పలువురు జైలుకి వెళ్ళి వచ్చారు. నేటికీ ఆ కేసులపై కోర్టులో విచారణ జరుగుతూనే ఉంది. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే.
Also Read – ఈ ఒక్క ప్రెస్‌మీట్ చాలదూ.. ఏపీ భవిష్యత్ తెలుసుకోవడానికి!
ఆ ఆస్తులలో తమకీ వాటాలు దక్కాలని విజయమ్మ, షర్మిల పట్టుబడుతున్నారు కనుక అక్రమస్తుల కోసం వారు నలుగురు కీచులాడుకొంటున్నారని భావించాల్సి ఉంటుంది.
జగన్‌కి నైతిక బాధ్యత గురించి షర్మిల గుర్తుచేస్తున్నారు కనుక అవి అక్రమాస్తులని, వాటిపై కోర్టులో కేసులు నడుస్తున్నాయని తెలిసీ వాటిలో వాటాలు కోరుకోవడమే పెద్ద తప్పు. కానీ కోరుకొంటున్నారు. అంటే నైతిక విలువల కంటే ఆస్తులే ముఖ్యమని వారు భావిస్తున్నట్లు అనుకోవలసి ఉంటుంది.
కనుక ఆ కేసులలో ఇన్నేళ్ళుగా జగన్ చేస్తున్న న్యాయ పోరాటాల ఖర్చులలో వాటాని వారు కూడా భరించడం అవసరమే.
ఏది ఏమైనప్పటికీ అక్రమాస్తులలో వాటాల కోసం వైఎస్ కుటుంబంలో జరుగుతున్న ఈ గొడవలతో వారి పరువు వారు తీసుకోవడమే కాక, ఇలాంటి న్యాయపరమైన అంశాలు కూడా వారే బహిరంగ చర్చకు పెట్టి ప్రజలందరినీ ఆలోచింపమని కోరుతున్నట్లున్నాయి.