షర్మిలమ్మా మీ రాహుల్నే నిలదీయొచ్చు కదా?

Sharmila on Special Status

ఎన్టీఆర్ జయంతినాడు లక్ష్మీ పార్వతి, పార్లమెంట్ సమావేశాలప్పుడు షర్మిల మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం ఓ ఆనవాయితీ.

కనుక ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల మీడియా ముందుకు వచ్చి ‘ప్రత్యేక హోదా’ గురించి మాట్లాడి, సిఎం చంద్రబాబు నాయుడు దీని గురించి ఎందుకు ప్రధాని మోడీని నిలదీయడం లేదని ప్రశ్నించారు. ఏపీ నుంచి ఇంత మంది ఎంపీలున్నా ఏ ఒక్కరూ ఎందుకు ‘ప్రత్యేక హోదా’ గురించి పార్లమెంటులో మాట్లాడారని ప్రశ్నించారు. అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తీరని నష్టం కలిగిస్తున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.

ADVERTISEMENT

ప్రత్యేక హోదా మాత్రమే కాదు…. ప్రాజెక్టులకు అనుమతులు, నిధులు, అభివృద్ధి కార్యక్రమాలు వంటి ప్రతీది రాజకీయ కోణంలోనే జరుగుతుంటాయని ఇన్నేళ్ళుగా రాజకీయాలలో ఉన్న షర్మిలకు తెలుసు. కనుక ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు సాధించడం లేదని ఆమె ప్రశ్నించడం అమాయకమనుకోలేము.

కానీ బీసీ రిజర్వేషన్స్‌ అంశంపై తెలంగాణ కాంగ్రెస్‌ దూసుకు పోతుంటే, షర్మిల సన్నికల్లు మీద మసాలా అరగ దీసినట్లు ఇంకా ఎంత కాలం ప్రత్యేక హోదాని పట్టుకొని అరగదీస్సితారు? దాని వలన ఆమెకు, ఏపీ కాంగ్రెస్ పార్టీని ప్కిరజలు ఆదరిస్తారా? ఆలోచిస్తే మంచిది.

అయినా బీసీ రిజర్వేషన్స్‌ కోసం ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంటులో పోరాడేందుకు తెలంగాణా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీని ఒప్పించినపుడు, అదే విదంగా ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలైన షర్మిల కూడా ప్రత్యేక హోదా కోసం రాహుల్ గాంధీని ఒప్పించవచ్చు కదా?

కానీ సార్వత్రిక ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ గెలిచి…. కేంద్రంలో అధికారంలోకి వచ్చి… రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయ్యాక… ప్రత్యేక హోదా ఇస్తారని చెప్పుకుంటున్నారు. అంటే కాంగ్రెస్‌ పార్టీకే ప్రత్యేక హోదాపై ఆసక్తిలేదన్న మాట!

అయినా రాహుల్ గాంధీ సైతం ‘బీసీ రిజర్వేషన్స్‌’ ఓ బ్రహ్మాస్త్రం అని భావించి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఈ పేరుతో రాజకీయాలు చేయాలని సూచిస్తున్నపుడు, షర్మిల ఇంకా ఇంకా ప్రత్యేక హోదా దగ్గరే ఆగిపోతే ఎలా?

ADVERTISEMENT
Latest Stories