నా ‘బ్లడ్’ అదే నా ‘బ్రీడ్’ అదే.! ఎనీ డౌట్స్..?

YS-Sharmila Sakshi

గిల్లి గిల్లించుకున్నాడు అనే సామెత ఇప్పుడు జగన్ కు చక్కగా సరిపోతుంది. తన రాజకీయ ప్రత్యర్థిగా మారిన సొంత చెల్లెలు వైస్ షర్మిల పై తన సాక్షిలో రోజుకొక కథనం ప్రచారం చేస్తున్నారు వైస్ జగన్. ఇలా చేసి ఆయన సాధించేది ఏమిటో షర్మిల తన పార్టీ ప్రచార వేదికల మీద జగన్ అండ్ కో కు తన వాగ్దాటితో గట్టిగా రుచి చూపిస్తున్నారు.

ADVERTISEMENT

తన పై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న సాక్షి మీడియా లో తనకు కూడా సమానమైన వాటా ఉందని, తనతండ్రి వైస్సార్ తన బిడ్డలిద్దరికి సమన్యాయం చేసారని వివరించారు. సొంత చెల్లి పై ఇటువంటి నీచానికి దిగజారి విమర్శలు చేయవలసిన అవసరం ఏమొచ్చింది…? ఎవరు ఔనన్నా…ఎవరు కాదన్నా..నేను వైస్ షర్మిల రెడ్డినే. నా పేరు ముందు వైస్ అనేది ఎప్పటికి ఎవ్వరు మార్చలేరని తానూ ఎప్పటికి రాజశేఖర్ బిడ్డనే అంటూ కుండబడ్దలు కొట్టారు షర్మిల.

వైసీపీ సోషల్ మీడియా, సాక్షి.., షర్మిల పేరు ముందు వైస్ కు బదులు మురుసుపల్లి, షర్మిల పేరు వెనుక ఉన్న రెడ్డి కి బదులు శాస్త్రి ని జోడించడంతో షర్మిల “నా బ్లడ్, నా బ్రీడ్” రెండు వైస్సార్ సొంత అనేలా తనను ట్రోల్ చేస్తున్న వారికీ పరోక్షంగా కౌంటర్ వేశారు. అలాగే రోజుకొక జోకర్ ను పెట్టుకుని సాక్షి మీడియా తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తుందని.., ఇటువంటి వాటికీ నేను భయపడను, ఎంపీక్కుంటారో పీక్కోండి అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

అలాగే జగన్ జైల్లో ఉన్న సమయంలో నేను సీఎం కావాలని ఆశపడినట్లుగా, దానికి నా భర్త అనిల్ కాంగ్రెస్ అధిష్టానంతో మంతనాలు చేసినట్లుగా కథనాలు సృష్టించే వారికీ ఆ మంతనాలు జరపడానికి తన భర్తతో పాటు వైస్ భారతి కూడా ఆసమయంలో ఢిల్లీ వెళ్లిన విషయం గుర్తులేదా..? గతంలో తానూ వైసీపీ పార్టీ బలోపేతానికి చేసిన కృషిని పార్టీ నేతలు మరిచిపోయారా..? తనకే పదవుల మీద ఆశ ఉంటే తన తండ్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తీసుకునేదాన్ని అంటూ జగన్ అండ్ కో పై రెచ్చిపోయారు షర్మిల.

ఇదంతా చూస్తూ ఎన్నికల సమయానికి ఈ అన్న చెల్లెళ్ళ యుద్ధం ఏస్థాయికి వెళుతుందో..?అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు వైకాపా నాయకులు. జగన్ తన సొంత మీడియాలో షర్మిల పై వార్తలు ప్రచారం చేస్తే షర్మిల మాత్రం జగన్ పై ఆయన కుటుంబంలో జరిగిన సంఘటనల పై బహిరంగ వేదికల మీద ప్రసంగించడం చూస్తుంటే “గిల్లి గిల్లించుకోవడం” అవసరమా..?అంటూ నిట్టూరుస్తున్నారు వైకాపా నేతలు.

ADVERTISEMENT
Latest Stories