న్యూటన్స్ లా: అర్థమైందా రాజా..!

ys jagan assembly

చర్యకు ప్రతి చర్య ఉంటుంది అనేదే న్యూటన్స్ లా. అయితే ఇప్పుడు ఈ న్యూటన్స్ ఫార్ములా ఏపీలో అమలు జరుగుతుందనే చెప్పాలి. గత ప్రభుత్వంలో వైసీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని హోదా లేకుండా చేసి తనకు 151 సీట్లు కట్టపెట్టిన ఏపీ ఓటర్లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.

ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో ఏపీ రాజధాని ఏది అన్న ప్రశ్నకు సామాన్యుడే కాదు ప్రభుత్వ పెద్దలు కూడా సమాధానం చెప్పలేకపోయారు. రాజధాని సమస్య ఒక రాష్ట్ర ప్రభుత్వ సమస్య అనుకున్న ప్రతి ఒక్కరికి ఇది ప్రభుత్వ సమస్య కానే కాదు 5 కోట్ల మంది ఆంధ్రుల ఆత్మ గౌరవానికి సంబంధించిన సమస్య అని అర్ధమయ్యింది.

ADVERTISEMENT

కేంద్ర ప్రభుత్వానికి కూడా ఏపీ రాజధాని విషయంలో ఒక స్పష్టత లేదంటే జగన్ రాష్ట్ర పరువును దేశ ప్రజల ముందు ఏమేరకు దిగజార్చారో తెలుసుకోవచ్చు. తండ్రి లేని బిడ్డ అంటూ ప్రజలను ఏమార్చి అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి ఒక ఆనాధగా ఏపీని ప్రపంచం ముందుంచారు.

కేంద్రం మెడలు వంచి తెస్తానన్న ప్రత్యేక హోదా తేలేకపోయిన జగన్ తనను నమ్మి ఓటేసిన రాజధాని అమరావతి రైతుల కడుపు చీల్చి మూడు రాజధానుల ప్రకటన చేసారు.
దీనితో ఇచ్చిన ఐదేళ్ల అవకాశాన్ని వెనక్కి తీసుకోలేక సార్వత్రిక ఎన్నికల కోసం వేయికళ్లతో ఎదురు చూసారు ఏపీ ప్రజలు.

ఐదేళ్ల కన్నీటికి, కడుపు మంటకు, అవమానాలకు సమాధానం చెప్పే రోజు మే -13 – 2024 రానే వచ్చింది. వారి నిస్సహాయతను, నియంత పాలనను అంతమొందించడానికి ఓటు అనే ఆయుధం తమ వేలు మీద సిరా బొట్టుగా మారడంతో జగన్ ఐదేళ్ల చర్యలకు ప్రతి చర్య ఎలా ఉంటుందో చూపించారు ఏపీ ప్రజలు. 151 సీట్లతో తలగరేసిన వైసీపీ ని 11 సీట్లకు పరిమితం చేసి వైసీపీ తలపొగరు నేలరాశారు ప్రజలు.

గత ఐదేళ్లుగా జగన్ రాష్ట్రానికి రాజధాని హోదా లేకుండా చేస్తే, దానికి గాను రిటర్న్ గిఫ్ట్ కింద జగన్ కు, వైసీపీ పార్టీకి ఏపీలో ప్రతిపక్ష హోదా లేకుండా చేసారు ఏపీ ఓటర్లు. బూతులతో రెచ్చిపోయిన బూతుల నేతలకు పోలింగ్ బూత్ లోనే బదులిచ్చారు. ఓట్లేసిన ప్రజలను రోడ్ల మీద కు తెచ్చిన నేతలను రోడ్డు కీడ్చారు. పాలించమని పదవిస్తే పెత్తనం చేసిన అధినేతను ప్యాలస్ కే పరిమితం చేసారు.

మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాట ఆడిన పార్టీని రాష్ట్రంలో మూడో స్థానానికి కుందించారు. గత ఐదేళ్లుగా జైళ్లు, బైళ్ళు అంటూ హేళన చేసిన నేతలను మళ్ళీ ఆ జైళ్ల గురించి ఆ బైళ్ల గురించి ఆలోచించే స్థాయికి తీసుకు వచ్చారు. ప్రతిపక్షాలను నాశనం చేసేద్దాం అనుకున్న జగన్ కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వలేదు. దీనితో జగన్ కు న్యూటన్స్ లా తీరి ప్రాక్టికల్ గా చేసి చూపించారు ఏపీ ప్రజానీకం. ఇప్పటికైనా జగన్ అండ్ కో కు న్యూటన్స్ లా పవర్ అర్దమయ్యిందా రాజా..! అంటూ సెటైర్లు కూడా పేలుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories