ysrcp-roja Dirty Politics

ఒక సమస్య లేదా ఒక అంశంపై సామాన్య ప్రజలు కూడా భిన్నాభిప్రాయలు వ్యక్తం చేయడం చాలా సహజమే. సంధ్య థియేటర్‌ ఘటనలో కొందరు అల్లు అర్జున్‌ తప్పేమీ లేదనగా కొందరు ఆరోజు ఆయన థియేటర్‌కి రాకపోతే అసలు తొక్కిసలాట జరిగేది కాదు.. మహిళ చనిపోయేదీ కాదు. కనుక దీనికి అల్లు అర్జునే పూర్తి బాధ్యుడు అని అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

రాజకీయ పార్టీలు, నేతలు కూడా భిన్నాభిప్రాయలు వ్యక్తం చేస్తుంటారు. కానీ వారు ఏ పార్టీలో ఉన్నారనే దానిని బట్టి వారి అభిప్రాయాలుంటాయి. సంధ్య థియేటర్‌ ఘటన కేసులో అధికార కాంగ్రెస్‌ నేతలు ఓ రకంగా వాదిస్తే, ప్రతిపక్షంలో ఉన్న బీజేపి, బిఆర్ఎస్ పార్టీలు ఒకలా వాదిస్తూ అల్లు అర్జున్‌కి మద్దతుగా నిలిచాయి.

Also Read – M9 పాఠకులకు ‘భోగి’ పండుగ శుభాకాంక్షలు..!

ఏపీలో వైసీపీకి కూడా ఇదే సూత్రం ప్రకారం పనిచేస్తుంది కనుక రాష్ట్రంలో ఏదైనా మంచి జరిగితే ‘అవన్నీ మా ప్రభుత్వ హయాంలో చేసినవే.. మొదలుపెట్టినవే’ అని తమ పద్దులో రాసుకుంటారు.

మాజీ మంత్రి రోజా నోటికి పనిచెప్పి చాలా కాలమే అయ్యింది. కనుక నిన్న తిరుపతిలో తొక్కిసలాట ఘటనని సిఎం చంద్రబాబు నాయుడు పద్దులో రాసేసి ఆయనపై నిప్పులు చెరిగారు. కాస్త ఫ్లాష్ బ్యాక్‌కి వెళ్ళి ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పుష్కరాలలో కూడా జనాలు చనిపోయారని గుర్తుచేసి నిన్న జరిగిన ఘటనకు చంద్రబాబు నాయుడు.. ప్రభుత్వ వైఫల్యమే అని రోజా నిర్ధారించేశారు. కనుక చంద్రబాబు నాయుడు తక్షణం రాజీనామా చేయడం చాలా అవసరమని రోజా ఒక్క ముక్కలో తేల్చేశారు.

Also Read – ఈ ఏడాది ఏపీకి అంతా శుభం… పండుగ చేసుకోవలసిందే!

రోజా నోరు విప్పితే పవన్ కళ్యాణ్‌ గురించి మాట్లాడకుండా నిగ్రహించుకోలేరు. కనుక ‘సనాతన ధర్మాన్ని కాపాడుతానన్న పవన్ కళ్యాణ్‌ ఎక్కడున్నారు? సంధ్య థియేటర్‌ ఘటనలో రేవంత్ రెడ్డిని వెనకేసుకు వచ్చిన ఆయన ఈ ఘటనపై ఎందుకు మాట్లాడటం లేదు?ఈ ఘటనకు బాధ్యులైన టీటీడీ, పోలీస్ అధికారులను, సిఎం చంద్రబాబు నాయుడుని నిలదీసి అడగాలని’ ఆమె పవన్ కళ్యాణ్‌కి ఉచిత సలహా ఇచ్చారు.

ఇంతకాలం కేసుల భయంతోనో లేదా జగన్‌ బయటకు రానప్పుడు తామెందుకు ప్రజల మద్యకు వెళ్ళాలని ఇళ్ళలో కూర్చొని కాలక్షేపం చేస్తున్న వైసీపీ నేతలందరూ పొగ పెడితే కలుగుల్లో నుంచి బయట పడిన్నట్లు, హడావుడిగా మీడియా ముందుకు వచ్చి సిఎం చంద్రబాబు నాయుడుని, కూటమి ప్రభుత్వాన్ని పోటాపోటీగా విమర్శిస్తున్నారు.

Also Read – కేటీఆర్‌.. ఈ సంక్రాంతి పండుగ ఇంట్లోనే…

వారందరి మాటలు వింటుంటే తొక్కిసలాటలో భక్తులు చనిపోయారనే బాధ ఏ కోశాన్నా కనిపించదు. ఈ పేరుతో సిఎం చంద్రబాబు నాయుడుని, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ని ఎవరు ఎంత గొప్పగా విమర్శించామా.. వాటితో జగన్‌ని మెప్పించగలమా? అనే ఆరాటమే కనిపించింది.

కనుక ఈ ఘటనపై సిఎం చంద్రబాబు నాయుడుని ఎన్ని కోణాలలో, ఎన్ని రకాలుగా విమర్శించాలనే తాపత్రయమే వారిలో ఎక్కువగా కనిపిస్తోంది.




ఓ పక్క శవ రాజకీయాలు చేస్తూనే, ఇంత హదావూడిలో కూడా వైసీపీ నేతలు మరిచిపోకుండా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్‌కి మద్య చిచ్చు పెట్టేందుకు కూడా ప్రయత్నించడం విశేషం.