
జగన్ తన తండ్రి సమాధిని వైసీపీకి పునాదిగా చేసుకొని, ఆయన చావుతో ప్రజలలో ఏర్పడిన సానుభూతితో వైసీపీని నిర్మించుకున్నారనేది రహాస్యమేమీ కాదు. తన సొంత ఇమేజ్‌తో ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రాలేనని గ్రహించినందునే ‘మన ప్రియతమ నాయకుడు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి’ అనే పదాలను పెట్టి ప్రసంగీస్తుండేవారు.
వైఎస్ షర్మిల తెలంగాణలో తాను రాజశేఖర్ రెడ్డి బిడ్డనని ఏవిదంగా చెప్పుకు తిరిగారో, జగన్ కూడా ఆదేవిద్యమగా తాను రాజశేఖర్ రెడ్డి కొడుకుని అని చెప్పుకు తిరిగారు. అంటే తనను చూసి కాకుండా చనిపోయిన తన తండ్రి మొహం చూసి తనను గెలిపించాలని ప్రజలను వేడుకున్నారన్న మాట!
Also Read – జగన్‌తో సహవాసం.. ముగింపు ఇలాగే!
మనదేశంలో ప్రజల మనసులు వెన్న వంటివి.. ఏమాత్రం వేడి తగిలిన కరిగిపోతుంటాయి. అలాగే తండ్రి లేని ఆ బిడ్డడి ఏడ్పులు చూసి జాలిపడి ఒక్క ఛాన్స్ ఇచ్చారు.
అప్పటి నుంచి తన తల్లి, చెల్లి, తండ్రి అవసరం లేదనే జగన్ భావించారు. తల్లిని చెల్లిని బయటకు పంపించేశారు. మెల్లగా తండ్రి పేరు వాడకం తగ్గించేసి జగన్ తనని తాను ప్రమోట్ చేసుకోవడం మొదలుపెట్టారు.
Also Read – జమ్ము కశ్మీర్‌కి ప్రజా ప్రభుత్వాలు పనికిరావేమో?
అ క్రమంలో స్కూలు పిల్లలకు ఇచ్చే చిక్కీలు మొదలు పొలంలో సరిహద్దు రాళ్ళ వరకు ప్రతీ చోట తన బొమ్మలు, పేర్లు వేయించుకున్నారు.
2024 ఎన్నికల నాటికి ఈ ప్రచార పిచ్చి పీక్ స్థాయికి చేరుకుంది. వందల కోట్లు ఖర్చు చేసి రాష్ట్రమంతా తన ఫోటోలతో ‘యుద్ధం.. సిద్దం..’ అంటూ ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టించారు. కానీ ఓడిపోయారు. కనుక మళ్ళీ తండ్రి గుర్తొచ్చారు. వైసీపీ సోషల్ మీడియాలో ప్రతీరోజూ ఆయనని జ్ఞాపకం చేసుకుంటున్నారు!
Also Read – గంట అరగంట వీరులకు అర్దమైంది కానీ దువ్వాడకు అర్ధం కాలే.. అందుకే..
నిజానికి పార్టీని జీరో స్థాయి నుంచి అధికార పీఠం తీసుకువచ్చిన క్రెడిట్ జగన్‌కే దక్కుతుంది. జనం కూడా ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ఆలోచించడం లేదు. జగన్ మొహం చూసే వైసీపీ వైపు ఉండాలో వద్దో నిర్ణయించుకుంటున్నారు.
మంచో చెడో జగన్ తనకంటూ ఓ సొంత ఇమేజ్ ఏర్పరచుకున్నారు. కనుక జగన్ నిర్భయంగా తండ్రి పేరుని, ఫోటోలని, విగ్రహాలను పక్కన పెట్టి సొంత ఇమేజ్‌తోనే దర్జాగా రాజకీయాలు చేసుకోవచ్చు.
కానీ ఓటమి తర్వాత జగన్ ఆత్మ స్థైర్యం బాగా తగ్గిపోవడం వలన మళ్ళీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవసరం ఉందని భావిస్తున్నారు. అందువల్లే కూటమి ప్రభుత్వం ఆయన పేరు తొలగించగానే ప్రళయం వచ్చేసినట్లు జగన్ హడావుడి చేస్తున్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు వింటేనే టీడీపీ నేతల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయని, ప్రజల గుండెల్లో ఆయన ఉన్నంత వరకు తనని (జగన్) ఏమీ చేయలేరనే విషయం గ్రహించినందునే చంద్రబాబు నాయుడు ఇటువంటి దురాలోచనాలు చేస్తున్నారని జగన్, వైసీపీ నేతలు వితండవాదం చేస్తున్నారు.
అయితే జగన్ తనని తాను అతిగా ప్రమోషన్ చేసుకునందునే, జనం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని మరిచిపోయారనే విషయం గ్రహించిన్నట్లు లేదు. నేటికీ ఆయన అవసరం జగన్‌కి, వైసీపీకి ఉంది. వైఎస్ పేరుతో జగన్, వైసీపీ నేతలు చేస్తున్న ఈ హడావుడే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం.
కానీ కూటమి ప్రభుత్వానికి జగన్-వైసీపీ గురించి తప్ప వైఎస్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆయన పేర్లు తొలగించడమే ఇందుకు నిదర్శనం.. కాదా?