
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ప్రత్యేక తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇద్దరు కూడా తెలుగు రాష్ట్ర ప్రజలకు సుపరిచితులే.
అయితే ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల వారసులు ఇప్పుడు తమ తండ్రి వారసత్వ హక్కు కోసం బాహ్య యుద్దానికి దిగారు. అయితే ఇందులో ఒకరిది ఆస్తి హక్కులతో కూడుకున్న రాజకీయ కలహాలైతే, మరొకరిది రాజకీయ వారసత్వ హక్కు కోసం పార్టీలో మొదలైన అంతర్ యుద్ధం.
Also Read – తల్లిపై కేసు.. తల్లికి వందనంతో మరో కేసు!
అలాగే ఈ రెండు కుటుంబ కథా చిత్రాలలో తండ్రులు వైఎస్ఆర్, కేసీఆర్ లు హీరోలైతే, అన్నలు వైస్ జగన్, కేటీఆర్ లు విలన్ పాత్రలను పోషిస్తున్నారు. ఇక చెల్లెళ్లుగా ఉన్న షర్మిల, కవిత బాధితుల మాదిరి సానుభూతి పాత్రలను రక్తికట్టిస్తున్నారు. ఈ రెండు రాజకీయ కుటుంబ కథా చిత్రాలలో తల్లులు విజయమ్మ, శోభా రావులు ప్రేక్షక పాత్రకు మాత్రమే పరిమితమయ్యారు.
అయితే ఇక్కడ వైఎస్ కుటుంబం విషయానికొస్తే, తండ్రి పేరుతో స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఒక్కటైన షర్మిల, జగన్ అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు ఒకే బాటలో నడిచారు, తండ్రి పేరును నిలిపారు. ఇక 2019 ఎన్నికలలో వైసీపీ విజయం, జగన్ ముఖ్యమంత్రి పదవి ఈ ఇద్దరు అన్నా చెల్లెళ్లను బద్ర శత్రువులుగా మార్చేసింది.
Also Read – వైసీపీ..ఒక “అందమైన” కుటుంబం..
వైసీపీ ఓటమిలో జగన్ కు భుజం కాసిన షర్మిల, వైసీపీ విజయంతో జగన్ కు భారంగా మారింది. వైసీపీ విజయం కోసం షర్మిల పడిన ఎనిమిదేళ్ల కష్టం జగన్ ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయింది. దీనితో అన్న వదిలిన బాణంగా ఏపీలో ఎంట్రీ ఇచ్చిన షర్మిల అన్న వదిలించుకున్న బాణంలా తెలంగాణకు పయనమయ్యింది.
ఇక తెలంగాణలో రాజన్న రాజ్య స్థాపన చేయడం సాధ్యం కాదని గ్రహించిన షర్మిల, ఏపీలో జగనన్న రాజ్యాన్ని కూలదోయడానికి సిద్దమై అన్న పతనం కోసం పంతం పట్టింది. అనుకున్నది సాధించింది. అయితే ఇక్కడ వైసీపీ విజయం ఇంటర్ వెల్ కాగా ఇక షర్మిల తిరోగమనం, తిరిగి ఆగమనం ఫ్రీ క్లైమాక్ అయితే వైసీపీ ఓటమి, జగన్ పరాజయం క్లైమాక్స్ గా వైఎస్ రాజకీయ కుటుంబ కథ చిత్రం ముగిసింది.
Also Read – సంక్షేమ పధకాలకు ఇంత తొందర ఎందుకు?
ఇక కేసీఆర్ కుటుంబ చిత్రానికొస్తే, ఇక్కడ పార్టీ గెలుపులో తండ్రి చాటు బిడ్డలు మాదిరి కలిసున్న అన్నాచెల్లెళ్లు కేటీఆర్, కవిత పార్టీ ఓటమిలో మాత్రం విభేదాలతో రచ్చలేపుతున్నారు. అయితే ప్రస్తుతానికి కవిత మాత్రమే బిఆర్ఎస్ రాజకీయ తెరమీద తన తిరుగుబాటు ప్రదర్శనను కొనసాగిస్తున్నారు.
అటు తండ్రి కేసీఆర్ కానీ ఇటు అన్న కేటీఆర్ కానీ ఇప్పటి వరకు కవిత తమ పైన పార్టీ పైన చేస్తున్న విమర్శలకు కానీ ఆరోపణలకు కానీ బదులు చెప్పే ప్రయత్నం చేయలేదు. తండ్రిని దేవుడంటూనే, ఆ దేవుడు దెయ్యాల మాట వింటున్నాడు అంటూ కవిత విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
అయితే కేసీఆర్ కుటుంబ కథ చిత్రంలో బిఆర్ఎస్ ఓటమి ఇంటర్వెల్ కాగా, కవిత అరెస్టు సెకండ్ ఆఫ్ అయితే కవిత కేసీఆర్ కు రాసిన లేఖ క్లైమాక్, అలాగే ఈ సినిమా కొనసాగింపుగా “హూ లీకెడ్ ది లెటర్” అంటూ పార్ట్ -2 అతి త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది.
ఇక్కడ వైఎస్ఆర్ కుటుంబ కథ చిత్రం లో సజీవంగా లేని తండ్రి పేరుతో రాజకీయం చేస్తూ వారికీ, వారి పార్టీకి రాజకీయ లబ్ది కోసం ప్రయత్నిస్తున్న జగన్, షర్మిల ఒక వైపు ఉంటే, పార్టీలో తండ్రి తరువాత స్థానం పై పట్టు కోసం, పార్టీలో ముఖ్య పదవి కోసం పోరాటడం చేస్తున్న కవిత, కేటీఆర్ లు మరోవైపు ఉన్నారు. ఈ రెండు రాజకీయ కుటుంబ కథ చిత్రాలలో ఏది ఉత్తమ చిత్రమో ప్రజలే నిర్ణయించాలి.