
వైసీపీ వ్యూహాలు ఒక్కోసారి ఆ పార్టీకి రాజకీయ లబ్దిని చేకూర్చేబదులు రాజకీయ చిక్కులను తెచ్చిపెట్టేవిలా మారుతున్నాయి. టీడీపీ పార్టీని ఇరుకున పెట్టేలా, ముఖ్యమంత్రి చంద్రబాబు టార్గెట్ గా వైసీపీ ఎత్తుకున్న ‘వెన్నుపోటు’ నినాదం వైసీపీ కి ఏమాత్రం రాజకీయ మైలేజ్ ను ఇవ్వలేదు సరికదా అదే వైసీపీ కి ‘గొడ్డలి వేటు’ అంటూ తిరిగి గుచ్చుకుంది.
నాడు నారా, నందమూరి కుటుంబాల మధ్య చెలరేగిన లక్ష్మి పార్వతి వివాదం నందమూరిని కూడా నారా వైపే నిలబడేలా చేసింది. అందుకు ప్రజలు కూడా ఓట్ల రూపంలో బాబు కి మద్దతుగా నిలబడ్డారు. అలాగే అటు నందమూరి కుటుంబం నుంచి కానీ ఇటు ప్రజల నుంచి కానీ ఏమాత్రం వ్యతిరేఖత వచ్చినా నాడు ఉమ్మడి ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చి ఉండేదా.? ఉమ్మడి ఏపీకి చంద్రబాబు తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యిఉండేవారా.?
Also Read – బిఆర్ఎస్ కారు స్టీరింగ్ బీజేపీ చేతిలో ఉందా.?
ప్రత్యర్థి నాయకుల ‘బాబు వెన్నుపోటు’ ప్రచారం నిజమైతే టీడీపీ 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని నిర్విరామంగా కొనసాగించగలుతుందా.? ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాబు నాయకత్వం ఏకగ్రీవంగా నిలబడగలుగుతుందా.? ఈ ప్రశ్నళ్లన్నింటికీ వైసీపీ నేతలు సరైన సమాధానం చెప్పగలిగితే వారు చేసే విమర్శలకు ఓ విలువ, వారి పార్టీ రాజకీయానికి ఒక విశ్వసనీయత ఉంటుంది.
ఇక వైసీపీ కి కౌంటర్ గా టీడీపీ ఎత్తుకున్న ‘గొడ్డలి వేటు’ వివాదానికి వస్తే, 2019 ఎన్నికల ముందు జగన్ సొంత ఇలాకాలలో వైఎస్ఆర్ సొంత తమ్ముడు, వైసీపీ నాయకుడు, మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి దారుణ హత్య, ఆ పై జరిగిన గుండె పోటు కథనాల ప్రచారం, అటు నుంచి గొడ్డలి వేటుగా మారిన వాస్తవాలు అన్ని ఇప్పటికి కోర్టులలో న్యాయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాయి.
Also Read – రప్పా రప్పా మీరు తొక్కేస్తే.. మేం లోపలేస్తాం!
ఇక సాక్షి గుండె పోటుకి, వివేకా గొడ్డలి వేటుకి మధ్య అనేకమంది వైసీపీ ముఖ్య నాయకుల పేర్లు బయటకొచ్చాయి. వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి….ఇంకా తెరవెనుక ఇంకొంతమంది వైఎస్ కుటుంబీకుల పేర్లు కూడా పులివెందుల సాక్షిగా, వైస్ వివేకానంద కుటుంబసభ్యుల నోట బహిర్గతం అయ్యాయి.
ఇటు జగన్ సొంత చెల్లి వైస్ షర్మిల సైతం వైస్ వివేకా గొడ్డలి వేటు వెనుక వైఎస్ కుటుంబ సభ్యుల హస్తం, వైసీపీ కుట్ర దాగి ఉందనేలా జగన్ కు వ్యతిరేకంగా అనేకానేక విమర్శలు చేసారు. వైస్ జగన్ టార్గెట్ గా వైసీపీ ని ఇబ్బందిపెట్టేలా సునీత చేసిన ఆరోపణలు కానీ, షర్మిల చేసిన విమర్శలు కానీ వైసీపీ ఓటమికి జగన్ పతనానికి నాందిగా నిలిచాయి.
Also Read – నేను రప్పా రప్పా తొక్కేస్తాను.. బాధ్యత చంద్రబాబుదే!
వైసీపీ గొడ్డలి వేటు తర్వాత వచ్చిన ఎన్నికలలో వైసీపీ 151 నుంచి 11 కు పరిమితం అవ్వడం వెనుక “హూ కిల్డ్ బాబాయ్” అనే అంతుచిక్కని ప్రశ్న కూడా ప్రధాన పాత్ర పోషించిందనే సత్యాన్ని వైసీపీ ఇప్పటికైనా గ్రహించలేకపోవడం వారి రాజకీయ అజ్ఞానికి నిదర్శనమే చెప్పాలి.
వైసీపీ గొడ్డలి వేటుకు జగన్ కు ప్రజలు నుంచి ఓటమి రూపంలో తిరస్కారమే ఎదురయ్యింది, అటు వైస్ కుటుంబ సభ్యుల నుంచి విమర్శల రూపంలో వ్యతిరేకతే వ్యక్తమయింది. ఇదే వైసీపీ వెన్నుపోటు ప్రచారానికి టీడీపీ గొడ్డలి వేటు కౌంటర్ కు మధ్య ఉన్న ప్రత్యర్థులు చూడలేని అనంతరం, ఒప్పుకోలేని వాస్తవాలు.