మోడీపై మెల్లగా వైసీపీ అస్త్రాలు… అందుకేనా?

Narendra Modi YSRCPఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్‌ అమిత్‌ షా విశాఖకు వచ్చి ‘జగన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది… జగన్‌ పాలనలో రాష్ట్రంలో అరాచకం తాండవిస్తోందంటూ,’ సూటిగా ఘాటుగా విమర్శలు చేసినప్పుడు, ‘మాకు బిజెపి అండలేనప్పటికీ…’ అంటూ సిఎం జగన్‌ టిడిపి, జనసేనలని విమర్శించారే తప్ప బిజెపిని, మోడీ, అమిత్‌ షాలను విమర్శించలేదు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళి రెండు రోజులు అక్కడే మకాం వేసి మోడీ, అమిత్‌ షాలతో భేటీ అయ్యి వారితో ఫోటోలు దిగారు. తద్వారా వారిరువురి ఆశీర్వాదాలు తనకు ఉన్నాయనే భావన వైసీపీ శ్రేణులకు కల్పించే ప్రయత్నం చేసిన్నట్లనిపిస్తుంది.

అయితే ఈ నెల 18న ఢిల్లీ, అశోకా హోటల్‌లో బిజెపి మిత్రపక్షాలు (ఎన్డీయే) సమావేశానికి టిడిపికి ఆహ్వానించిన్నట్లు వార్తలు రావడంతో ఇక బిజెపితో అనుబందం తెగిపోయినట్లే, దాంతో కూడా యుద్ధం అనివార్యమే అని వైసీపీ గ్రహించినట్లే ఉంది. బహుశః అందుకే తొలిసారిగా జగన్‌ మనసాక్షిలో ‘చెప్పేదొకటి చేసేదొకటి’ అంటూ ఓ కధనంలో ప్రధాని నరేంద్రమోడీపై సున్నితంగా విమర్శలు మొదలుపెట్టింది.

ADVERTISEMENT

దాని సారాంశం ఏమిటంటే, ప్రధాని నరేంద్రమోడీ వరంగల్‌లో పర్యటించినప్పుడు కేసీఆర్‌ కుటుంబపాలన, అవినీతి పాలన అంటూ విమర్శలు చేశారని కానీ బిజెపిలోనే అనేకమంది వారసులున్నారని, బిజెపి పొత్తులు పెట్టుకొనే టిడిపి వంటి పార్టీలు కూడా కుటుంబ పార్టీలే అని గుర్తు చేసింది.

‘లిక్కర్ స్కామ్‌’తో కేసీఆర్‌ అవినీతి ఢిల్లీ వరకు పాకిపోయిందని విమర్శించారు కానీ ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవితపై చర్యలు తీసుకోవడంలేదని ఆత్మసాక్షి ప్రశ్నించింది.

ఒకవేళ దేశంలో ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని తెలిస్తే చర్యలు తీసుకోకుండా కేసుల గురించి మాట్లాడుతూ బెదిరించడం ఏం పద్దతి అని ఆత్మసాక్షి ప్రశ్నించింది. వేలకోట్లు రుణాలు ఎగవేసిన వారందరినీ బిజెపిలో ఉంచుకొని ఇతర పార్టీల అవినీతి గురించి ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడటం ఏమి సబబు? అని ప్రశ్నించింది.

కర్ణాటకలో బిజెపి అవినీతి కారణంగానే ఓడిపోయిందని, తెలంగాణలో బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ని పదవిలో నుంచి తొలగించి బిఆర్ఎస్ పార్టీకి పరోక్షంగా సాయపడుతున్నట్లు ప్రజలు భావించేలా చేశారని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈవిదంగా ‘బిజెపి చేసేదొకటి చెప్పేదొకటి,’ అన్నట్లు వ్యవహరిస్తోందని ఆత్మసాక్షి తేల్చి చెప్పేసింది.

వైసీపీ పట్ల తమ వైఖరి ఏవిదంగా ఉండాలో అమిత్‌ షా, జేపీ నడ్డా స్పష్టంగా చెప్పి వెళ్లారు కనుక ఏపీ బిజెపి అధ్యక్ష పదవి చేపట్టిన దగ్గుబాటి పురందేశ్వరి కూడా నేడో రేపో వైసీపీపై యుద్ధం మొదలుపెట్టవచ్చు. కనుక వైసీపీ ఇప్పటి నుంచే అందుకు సన్నాహాలు మొదలుపెట్టినట్లుంది.

అయితే ఇక్కడ రాష్ట్రంలో బిజెపి-వైసీపీలు కత్తులు దూసుకొంటూ ఢిల్లీలో కౌగలించుకొంటుంటే రెండు పార్టీలపై ప్రజలకు నమ్మకం పోతుంది కదా?ఈవిదంగా చేస్తుండటం వలన రెంటిలో ఏ పార్టీ ఎక్కువ నష్టపోతుంది?అంటే వైసీపీ అనే చెపొచ్చు. ఎందుకంటే ఏపీలో బిజెపి కొత్తగా నష్టపోయేందుకు ఏమీ లేదు కనుక!

ADVERTISEMENT
Latest Stories