విఘ్నేశ్వరుడు కి తప్పని “వైసీపీ” రంగుల బెడద…!

YSRCP-Colors-to-Ganesh-Idolఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ ‘వైసీపీ’ రంగుల మోత అటు ప్రభుత్వ భవనాలకు., కరెంట్ పోల్స్ కు., ప్రభుత్వ పథకాల పంపిణీలకు మాత్రమే పరిమితం కాలేదు., చివరకు ఆ గణనాధుడుకి కూడా ఆ రంగుల బెడద తప్పలేదు అనేది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న గణేష్ ప్రతిమలతో రుజువయ్యింది.

రాష్ట్రంలో ఇప్పటికే ఈ వైసీపీ రంగుల రచ్చ హైకోర్టుని తాకింది. గణేష్ ఉత్సవాలకి జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు వివాదాస్పదంగా మారాయి. రోడ్ల మీద గణపతి ప్రతిమ పెట్టాలంటే రోజుకు వెయ్యి రూపాయలు చెల్లించాలనే, నిబంధన అమలు చేస్తున్నారంటూ ఇప్పటికే టిడిపి నేత బోండా ఉమా ప్రభుత్వంపై విమర్శనాస్ర్తాలు ఎక్కుపెట్టారు.

ADVERTISEMENT

రాజకీయాలలో ప్రచారానికి కాదేది అనర్హం అన్న చందంగా తయారయ్యాయి రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు. “తినగా తినగా…. బూరెలు కూడా చేదుగా” ఉంటాయనే సామెత మాదిరే ప్రచారం కూడా హద్దులు దాటితే అసలుకే ఎసరు వస్తుందనే అంశాన్ని అటు పార్టీ పెద్దలు.., ఇటు పార్టీ కార్యకర్తలు దృష్టిలో పెట్టుకుని మెలగడం శ్రేయస్కరం అని గుర్తుంచుకోవాలి.

ఏ రాజకీయ పార్టీకైనా.., వారి అనుచరులకైనా పార్టీ మీద ప్రేమ ఉండడం తప్పుకాదు.,కానీ వారి ఇష్టాన్ని భక్తుల మీద రుద్దాలని చూడడమే విమర్శలకు తావిస్తుంది. ఇటువంటి కార్యక్రమాల వలన ప్రజలలో పార్టీ పట్ల., ఆ పార్టీ నేతల పట్ల ఏసడింపే తప్ప మరొకటి ఆశించడం అత్యాశే అవుతుంది.

ADVERTISEMENT
Latest Stories