
ఈసారి 175కి 175 సీట్లు మేమే గెలుచుకొని మళ్ళీ అధికారంలోకి వస్తామని ప్రగల్భాలు పలికిన జగన్ 11 సీట్లు మాత్రమే రావడంతో జనాలకు మొహం చూపించలేని పరిస్థితి నెలకొంది. అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయినందున వైసీపి నేతలు కూడా ప్రజల మద్యకు రాలేని పరిస్థితి నెలకొంది.
Also Read – ఒక్క ఫోన్‌కాల్‌తో వందకోట్లు అప్పు.. దటీజ్ విజయసాయి రెడ్డి!
అయినప్పటికీ శవ రాజకీయాలు, చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవడం లేదు. మొన్న అచ్యుతపురం ప్రమాద ఘటనపై శవరాజకీయాలు చేసిన వైసీపి నేతలు ఇప్పుడు అన్నా క్యాంటీన్లతో చిల్లర రాజకీయాలు చేస్తుండటం చూసి ప్రజలు కూడా వారిని అసహ్యించుకుంటున్నారు.
మొన్న తణుకులో వైసీపికి చెందిన కొందరు అన్నా క్యాంటీన్‌కి వచ్చి కడుపు నిండా భోజనం చేశారు. వారి అధినేత వద్దనుకున్న అన్నా క్యాంటీన్‌లో వారు భోజనం చేయడం యాదృచ్ఛికం కాదనే విషయం వారి చిల్లర రాజకీయంతో వారే స్వయంగా బయటపెట్టుకున్నారు.
Also Read – అభివృద్ధి కంటే వినాశనానికే మద్దతెక్కువా..?
అన్నా క్యాంటీన్‌లో పరిశుభ్రత పాటించడం లేదని, అందరూ చేతులు కడిగే సింక్‌లో భోజనం పళ్ళాలు కడుగుతున్నారని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారు. దీనిపై వెంటనే స్పందించిన హరేకృష్ణ సంస్థ ప్రతినిధులు వచ్చి క్యాంటీన్ నిర్వాహకులని ప్రశ్నించగా, భోజనాలు చేసిన తర్వాత వైసీపి వాళ్ళే ప్లేట్లను సింక్‌లో పడేశారని, సిబ్బంది వచ్చి దానిలో నుంచి వాటిని తీస్తుంటే వారు ఫోటోలు, వీడియోలు తీశారని చెప్పారు.
మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ, అన్నా క్యాంటీన్లలో చాలా పరిశుభ్రత పాటిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. చాలా నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందిస్తుంటే దానిపై కూడా వైసీపి సైకోలు విషప్రచారం చేస్తున్నారని అన్నారు.
Also Read – వైసీపీ నేతలు ధీమాగానే ఉన్నారు మరి ప్రభుత్వం?
జగన్ అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడుకి మంచి పేరు వస్తుందనే అసూయంతోనో లేదా ఆయన మొదలు పెట్టిన ఏ పనిని తాను చేయకూడదనే ద్వేషంతోనోరాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్న అన్నా క్యాంటీన్లను మూసేసి పేదల కడుపు కొట్టారు. ఇప్పుడు టిడిపి కూటమి ప్రభుత్వం మళ్ళీ వాటిని ప్రారంభిస్తే నేటికీ అసూయతో ఈవిదంగా నీచ రాజకీయాలు చేస్తున్నారు.
టిడిపి కూటమి ప్రభుత్వాన్ని రాజకీయంగా ఎదిరించలేక, ప్రశ్నించేందుకు తగిన అంశాలు లేకనే ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తున్నట్లు భావించవచ్చు. వీటికి బదులు రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే ధైర్యం ఉందా?
ఇదిరా నిజం, ఇంత హైజెనిక్ గ వండి శుభ్రపరిచి అన్నం పెడుతుంటే మీ బాధ ఏందిరా స్వామి @DrPradeepChinta @SajjalaBhargava @RGVzoomin @YSRCParty ??
చి..ఛీ..చీప్.. శవాల మీద చిల్లర ఏరుకునే బ్యాచ్ రా మీరంతా..
పేదోడికి పట్టెడన్నం పెట్టే అన్న క్యాంటీన్ మీద ఏందిరా మీ రాజకీయం..
ఆకలితో వచ్చిన… pic.twitter.com/DdX2bxzLnt
— Venugopalreddy Chenchu (TDP Official Spokesperson) (@venuchenchu) August 26, 2024