Gorantla Madhav Arrest

విధ్వంసానికి నిలువెత్తు రూపం, ముర్కత్వానికి సజీవ సాక్ష్యం అన్నట్టుగా తయారయ్యింది వైసీపీ పార్టీ, ఆ పార్టీకి చెందిన నాయకులు. అయితే తాజాగా వైస్ భారతి మీద కిరణ్ అనే వ్యక్తి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు గాను ఆయన మీద పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసారు.

అయితే ఆ కిరణ్ అనే వ్యక్తిని మంగళగిరి నుండి గుంటూరు తరలించే ప్రక్రియలో భాగంగా పోలీస్ వాహనాన్ని వెంబడించిన వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి కిరణ్ పై నీ అంతు చూస్తా, నిన్ను వదిలి పెట్టను అంటూ గోరంట్ల బెదించడంతో పోలీస్ అధికారులు ఆయన్ను కూడా అరెస్టు చేసారు.

Also Read – పోలీస్ గడప దాటించి కోర్టుకి తీసుకువెళ్తే చాలు.. కేసు ఫినిష్!

అయితే గతంలో ఇదే వైసీపీ నేతలు బాబు సతీమణి భువనేశ్వరి పై ఏకంగా అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసారు. అయినా కూడా పార్టీ అధినేతగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గా, అసెంబ్లీ లో ఉండి కూడా జగన్ ఆ వ్యాఖ్యలను ఖండించలేదు, సదరు వైసీపీ నేత మీద చర్యలు తీసుకోలేదు.పైగా చిక్కటి షిరు నవ్వులు చిందిస్తూ ఆ వ్యాఖ్యలను ఆస్వాదించారు.

కానీ సీఎం బాబు మాత్రం రాష్ట్రంలో మహిళల గౌరవానికి భంగం కలిగేలా ఏ వ్యక్తి వ్యాఖ్యలు చేసినా దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదు అనే సంకేతాలు ఇస్తూ సొంత పార్టీ క్యాడర్ ను సైతం జైలుకు తరలించేలా, పార్టీ నుండి బహిష్కరించేలా చర్యలు తీసుకున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి నిర్ణయాన్ని అభినందించాల్సింది పోయి ఇలా అధినేత వద్ద మెప్పు కోసం గోరంట్ల అత్యుత్సహం చూపడం అరెస్టుకు దారి తీసింది.

Also Read – వైసీపీ నేతలు ధీమాగానే ఉన్నారు మరి ప్రభుత్వం?

గతంలో ఒక పోలీస్ అధికారిగా ఉన్న ఈయన గారు ఇప్పుడిలా రాజకీయ నాయకుడిగా మారి పోలీస్ విధులకు భంగం కలిగేలా ప్రవర్తించడం మీద కూడా మాధవ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఒక్కసారి ఈ గోరంట్ల గారి ట్రాక్ రికార్డు చూసుకుంటే అటు పోలీస్ అధికారిగా, ఇటు రాజకీయ నాయకుడిగా ఇలా ఎటు చూసిన ఆయన మీద నీలి ఛాయలే కనిపిస్తాయి.

కార్యకర్త స్థాయి వ్యక్తి భారతి పట్ల ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తే సహించలేకపోతున్న ఈ వ్యక్తి నేడు జగన్ కు ప్రభుత్వం సెక్యూరిటీ తగ్గించిందంటూ మీడియా ముందుకొచ్చి మంత్రి లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసారు. ఆడాళ్లకు అక్క కాదు, మగాళ్లకు బావ కానీ లోకేష్ కు Z+ సెక్యూరిటీ, కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి కి మాత్రం అరకొరా భద్రతా అంటూ మాజీ ఎంపీ స్థాయి వ్యక్తి మంత్రి పై ఇంతలా దిగజారి వ్యాఖ్యానించారు.

Also Read – స్మితా సభర్వాల్: ఈమెను ఎలా డీల్ చేయాలబ్బా!


దీనితో గోరంట్ల మాధవ్ స్థాయి ఇదే, ఆయన రాజకీయ ఇదే, ఇటువంటి వ్యక్తులను పార్టీలో పెట్టుకుని పోషిస్తున్న జగన్ విలువలు, విశ్వసనీయత అంటూ కాకమ్మ కబుర్లు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టే అవుతుంది. ఇటువంటి వారు రాజకీయ నాయకులుగా మారడం నిజంగా ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యమనే చెప్పాలి.