హెరిటేజ్ చుట్టూ వైసీపీ కల్తీ ప్రచారాలు.?

Heritage Foods logo amid political controversy and legal dispute

సాంప్రదాయ రాజకీయ పార్టీలకు, ఆ పార్టీ రాజకీయ నాయకులకు రాజకీయాలు చేయడానికి ఒక సరిహద్దు గీత అనేది ఉంటుంది, ఉండాలి కూడా. అయితే రాజకీయాలలోకి వైసీపీ ఎంట్రీ తో ఆ సరిహద్దు గీత ఇప్పుడు కనుమరుగవుతుంది.

రాజకీయ పార్టీల నేతలు తమ ప్రత్యర్థి పార్టీ నేతల పై రాజకీయ విమర్శలు చేస్తారు, చెయ్యాలి కూడా. అయితే ఆ విమర్శలు కేవలం పాలనాపరమైన అంశాల మీదే ఉండాలి, వాటికీ సంబంధించిన అంశాల చుట్టే పరిమితం కావాలి.

ADVERTISEMENT

కానీ వైసీపీ రాకతో ఆ విమర్శలు రాజకీయం నుంచి వ్యక్తిగతంలోకి వెళ్లాయి. ఇక అక్కడి నుంచి కుటుంబ సంబంధాలను, వైవాహిక జీవితాలను వైసీపీ సోషల్ మీడియా వేదికగా బజారులోకి తెచ్చింది. ఇక అక్కడితో కూడా ఆగేదెలా అన్నట్టుగా రాజకీయాలకు సంబంధం లేని మహిళలను చట్ట సభలలో అగౌరవపరిచింది.

తన రాజకీయ ప్రత్యర్థి ఎవరైనా, ఎంతటి వారైనా, ఆ వ్యక్తి మహిళైనా, చివరికి సొంత తల్లైనా, చెల్లైనా కూడా తగ్గేదెలా అన్నట్టుగా దిగజారుడు రాజకీయంతో రాజకీయంలో ఇన్నాళ్ళుగా ఉండే విలువలు అనే కవచాన్ని నిట్టనిలువునా చీల్చేసింది.

ఇక ఇప్పుడు వైసీపీ పై వస్తున్న కల్తీ నెయ్యి ఆరోపణల నుంచి బయటపడడానికి ఏకంగా సీఎం చంద్రబాబు కుటుంబానికి సంబంధించిన హెరిటేజ్ ఫుడ్స్ పై కల్తీ ప్రచారాలు మొదలుపెట్టింది. 1992 లో నారా చంద్రబాబు నాయుడు చేతుల మీద స్థాపించబడిన హెరిటేజ్ ఫుడ్స్ ప్రజల మన్ననలను పొందింది.

అలా 1994 లో IPO ద్వారా స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన హెరిటేజ్ అంచలంచెలుగా ఇన్వెస్టర్ల నమ్మకం పొందుతూ ప్రముఖ డైరీ సంస్థలలో ఒకటిగా నిలిచింది. అటువంటి సంస్థ పై ఇప్పుడు వైసీపీ చేస్తున్న కల్తీ ప్రచారాలు, నడిపిస్తున్న నీలి కథనాలు ఆ సంస్థ యొక్క గౌరవ మర్యాదలను దిగజారుస్తుంది.

తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం వైసీపీ ని రాజకీయంగా ఇరకాటంలో పడేస్తుండగా అందులో నుంచి బయటకు వచ్చేందుకు హెరిటేజ్ కి బాబా డైరీ తో సంబంధాలు ఉన్నాయని, హెరిటేజ్ కి ఇందాపూర్ డైరీ తో బంధాలు ఉన్నాయంటూ వైసీపీ చేస్తున్న నీలి ప్రచారాల పై హెరిటేజ్ సుప్రీం కోర్ట్ ను సైతం ఆశ్రయించింది.

తమ రాజకీయ లబ్ది కోసం తమ సంస్థ పై సాక్షి నిరాధార ఆరోపణలు చేస్తుందని, ఇది తమ సంస్థ పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తుందంటూ హెరిటేజ్ యాజమాన్యం వైసీపీ సాక్షి మీద 100 కోట్లకు పరువు నష్టం దావా వేసింది.

అలాగే సుప్రీం కూడా హెరిటేజ్ వాదనతో ఏకీభవిస్తూ హెరిటేజ్ సంస్థ కు వ్యతిరేకంగా సాక్షి వండి వడ్డించిన కథనాలు, వాటి తాలూకా లింకులను అన్ని సామజిక మాధ్యమాల నుంచి తొలగించాలంటూ సాక్షికి కీలక ఆదేశాలు జారీ చేసారు.

ఇక ఇప్పుడు మరోకొత్త ఆరోపణతో వైసీపీ హెరిటేజ్ పై విషం చిమ్మేనందుకు సిద్దమయ్యింది. VSR ఏవియేషన్స్ తో హెరిటేజ్ కి సంబంధం ఉందంటూ వైసీపీ మరోకొత్త వాదనతో తెరమీదకు వచ్చింది. అయితే దీని పై స్పష్టత ఇచ్చేందుకు నారా లోకేష్ ఒక ప్రకటన చేసారు.

2022 లో హెరిటేజ్ ఫిన్ లీజ్ లో VSR సంస్థ ఫైనాన్స్ తీసుకుందని, ఈ రోజు మేము అధికారంలోకి వస్తామని, మా పార్టీ ఎంపీ ఏవియేషన్ మంత్రి అవుతారని, అజిత్ పవర్ VSR హెలికాఫ్టర్ లో ప్రయాణిస్తూ మరణిస్తారని మేమేమైనా కలకన్నామా.?

ఇటువంటి అర్ధం పర్ధం లేని ఆరోపణలు చేస్తూ రాజకీయంలోకి వ్యాపార సంస్థను లాగడం వైసీపీ దిగజారుడుతనం అంటూ మండిపడ్డారు లోకేష్. అలాగే నాడు సొంత బాబాయ్ ని గొడ్డలివేటు వేసి ఆ కత్తి తెచ్చి మా చేతిలో పెట్టారు, ఇప్పుడు డే మాదిరి VSR ఏవియేషన్స్ తో కలిపి హెరిటేజ్ పై వైసీపీ చేస్తున్న ఆరోపణలు కూడా అలాంటివే అంటూ లోకేష్ వైసీపీ వ్యాఖ్యలను కొట్టిపారేశారు.

ADVERTISEMENT
Latest Stories