ఏడుకొండలవాడా… ఎంతపని చేశావయ్యా!

YSRCP leaders performing Hindu rituals and showcasing religious identity amid political controversy

సోగ్గాడు సినిమాలో ‘ఏడు కొండలవాడా వేంకటేశా ఎంత పనీ చేశావు తిరుమలేశా? చెట్టు మీద కాయని, సముద్రంలో ఉప్పును కలిపినట్లే కలిపావు శ్రీనివాసా…” అంటూ ఓ రొమాంటిక్ సాంగ్‌ ఉంది.

ఇప్పుడు ఏ పండగ వచ్చినా వైసీపీ నేతలందరూ పంచెలు కట్టుకొని, నామాలు పెట్టుకొని హడావుడి చేస్తుండటం చూస్తుంటే ఆ పాటే గుర్తువస్తుంది.

ADVERTISEMENT

చెట్టు మీద కాయని, సముద్రంలో ఉప్పును ఆ తిరుమలేశుడే కలిపాడని నాడు ఆత్రేయ గారే చెప్పారు. వైసీపీ నేతలను కూడా ఆ తిరుమలేశుడే ఇలా కలుపుతున్నాడు.

తిరుమలేశుని ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడటమే మహా పాపం. అలాంటి వంద తప్పులు చేసి, వాటిని సమర్ధించుకోవడం లేదా కప్పి పుచ్చుకోవడం ద్వారా వైసీపీ నేతలు పశ్చాతాపపడటం లేదని స్పష్టమవుతోంది.

ఆ తప్పులని చంద్రబాబు నాయుడు నెత్తిన రుద్దాలనుకోవడం ‘భస్మాసుర హస్తాన్ని నెత్తి మీద పెట్టుకున్నట్లే అయ్యిందని చెప్పక తప్పదు. వైసీపీ నేతలు ఆ తప్పులను ఇంకా కొనసాగిస్తూ స్వామివారి చిత్ర పఠాలు, ప్రతిమలతో వైసీపీ సభ్యులు శాసనమండలికి వచ్చి రాజకీయాలు చేసి సిఎం చంద్రబాబు నాయుడుకి అడ్డంగా దొరికిపోయారు.

వైసీపీ అపచారాలని కూటమి ప్రభుత్వం ప్రజలకు అర్ధమయ్యేలా చేయడంతో జగన్‌తో సహా వైసీపీ మేధావులందరూ ఉలిక్కి పడ్డారు.

అందుకే “మేము ‘మహా హిందువులం’ కావాలంటే చూడండి నుదుట పెద్ద పెద్ద నామాలు పెట్టుకున్నాం… యజ్ఞాలు యాగాలు చేస్తున్నాం. గుళ్ళు గోపురాలకు వెళుతున్నాం. మా పిల్లల పెళ్ళిళ్ళు హిందూ సాంప్రదాయం ప్రకారం చేస్తున్నాం… అంటూ ఫోటోలు, వీడియోలు చేయించుకొని సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు.

ఇటీవలే తాడేపల్లి ప్యాలస్‌లో ‘ఉగాది ఈవెంట్’ నిర్వహించి జగన్‌ దంపతులు ఫోటోలు, వీడియో చేయించుకొని ఆ సాక్ష్యాధారాలు హిందూ ఓటర్లకు సమర్పించారు.

అయితే వారిలో పశ్చాతాపం లేదు కనుక ఈ పాపాలకు ప్రాయశ్చిత్తం కూడా ఉండదు. కనుక ఇప్పుడు ఏ పండగ వచ్చిన వైసీపీ నేతలందరూ తాము హిందువులమని పదేపదే నిరూపించుకోవాల్సి వస్తోంది!

కానీ చేసిన పాపానికి తాము హిందువులమని లేదా హిందూమతం పట్ల తమకు గౌరవం ఉందని జగన్‌ బ్యాచ్ పదేపదే నిరూపించుకోవాల్సి రావడం ఆ తిరుమలేశుని ఎఫెక్టే కదా?

ADVERTISEMENT
Latest Stories