వైసీపీ రాజకీయం లో సింహ భాగం కుల రాజకీయాలకే కేటాయిస్తారు అనేలా వారి రాజకీయం సాగుతుంది. టీడీపీ, జనసేన పొత్తు విచ్ఛిన్నం కోసం వైసీపీ నిరంతరం కాపు సామాజికవర్గం కేంద్రంగా రాజకీయాలు నడుపుతుంది.
ఇందుకోసం అయితే రెడ్డి గా మారిన ముద్రగడ పద్మనాభం ను రంగంలోకి దింపుతోంది, లేదంటే తాజాగా జగన్ చేతుల మీదుగా కాపు సింహం గా అవార్డు అందుకున్న అంబటి రాంబాబు ని తెరమీదకు తెస్తుంది, అది కుదరకపోతే నేను జగన్ వద్ద పెద్ద పాలేరు అని సగర్వంగా ప్రకటించుకున్న పేర్ని నాని ని మీడియా ముందుకు తెస్తుంది.
ఇలా సోకాల్డ్ వైసీపీ కాపు నాయకులను ముందు పెట్టి వెనుకన వంగవీటి రంగా పేరు ఉంచి టీడీపీ, జనసేన పార్టీల రాజకీయ పొత్తును సామజిక పొత్తుగా చూపించేందుకు, ఆ రెండు సామాజికవర్గాల మధ్య చెరపలేని రాజకీయ వైరం ఉన్నట్టుగా చిత్రీకరించేందుకు వైసీపీ తెగ తాపత్రయ పడుతుంటుంది.
కాపు సామాజికవర్గాన్ని వైసీపీ మత్రమే కాపు కాయగలదు అనేలా తన పార్టీ కాపు నేతలందరినీ మీడియా ముందుంచి అదే సామజిక వర్గం నుండి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పవన్ ను అటు వ్యక్తిగతంగా ఇటు రాజకీయంగా టార్గెట్ చేయిస్తుంది వైసీపీ.
ఇటువంటి రాజకీయం తో వైసీపీ కాపు సామాజికవర్గాన్ని కాపు కాయలనుకుంటుందా.? లేదా కాటు వేయాలనుకుంటుందా.? సీఎం బాబు పై అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్టయిన అంబటి కి పవన్ పరామర్శ దక్కపోతే అది పవన్ కాపు జాతికి చేసిన అన్యాయంగా,
రంగా చిత్ర పటం లేకుండా పవన్ చేస్తున్న రాజకీయం కాపు ద్రోహంగా, ముద్రగడ పై కాపు సమాజం విమర్శలు పవన్ ఆ సామాజికవర్గానికి చేస్తున్న మోసంగా ఇలా రాష్ట్రంలో వైసీపీ అనుకూల కాపు నేతలకు ఎదురయ్యే ప్రతి వ్యతిరేకతను పవన్ కి ఆపాదిస్తూ మీకు కాపు జాతి మీద ప్రేమ లేదా.? అంటూ పవన్ టార్గెట్ గా వైసీపీ చేస్తున్న రాజకీయం నిజంగా కాపు సామాజికవర్గం హర్షిస్తుందా.?
వైసీపీ దృష్టిలో కాపు అంటే వైసీపీ పార్టీలో ఉన్న కాపు రాజకీయ నేతలు మాత్రమేనా.? ఇంకెన్నాళ్లు రంగా పేరు చెప్పుకుంటూ, ఆయన తనయుడు రాధ ను అవమానిస్తూ వైసీపీ కాపు రాజకీయం చెయ్యాలని భావిస్తుంది. వైసీపీ చేస్తున్న ఈ కుల రాజకీయ ట్రాప్ లోకి పవన్ ను లాగాలని వైసీపీ చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా పవన్ ఎప్పటికప్పుడు తన ప్రకటనలతో విచ్ఛిన్నం చేస్తున్నా,
వైసీపీ మాత్రం తగ్గేదెలా అన్నట్టుగా అవకాశం చిక్కినప్పుడల్లా కాపు సామాజికవర్గ ప్రజలను పవన్ ను దూరం చేసేందుకు, టీడీపీ తో జనసేన రాజకీయ బంధం ముక్కలయ్యే విధంగా కాపు సామాజికవర్గాన్ని రెచ్చకొట్టే రాజకీయాలు చేస్తూనే వస్తుంది. మరి వైసీపీ ట్రాప్ నుంచి పవన్ తప్పించుకున్నట్టే కాపు సామాజికవర్గం కూడా తప్పించుకోగలదా.?






