అసెంబ్లీకి వెళ్ళనిదానికి ఎన్ని రోజులు నిర్వహిస్తే వైకాపాకు ఏంటి?

YSRCP MLA adimulapu sureshవైఎస్ ఆర్ కాంగ్రెస్ కు చెందిన ఆయన ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలం సురేష్ ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కన్నా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ బెటర్ అని అన్నారు. తెలంగాణలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలను ఎక్కువ రోజులు నిర్వహిస్తున్నారని, ఏపీలో బడ్జెట్‌ సమావేశాలను 14 రోజులు కూడా జరపడంలేదని ఆయన అన్నారు.

ADVERTISEMENT

తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం లభిస్తోందని, ఏపీలో కనీసం 5 నిమిషాలు కూడా వైసీపీ సభ్యులకు అవకాశం ఇవ్వడంలేదని సురేష్ విమర్శించారు. అయితే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే వైకాపా మొత్తానికి ఈ సమావేశాలని బహిష్కరించి పాదయాత్రలో బిజీగా ఉంది.

వైకాపా సభ్యులకి నిజంగా 5 నిముషాల సమయమే ఇచ్చిన ఆ సమయం కూడా వాడుకునే ఉద్దేశం లేదు ఆ పార్టీకి. అంతటి దానికి ఎన్ని రోజులు సభ నిర్వహిస్తే ఏంటి తెలుగు దేశం నాయకులు అంటున్నారు. వైకాపా నాయకులకు రుచించకపోయినా తెదేపా వారు అడిగిన ప్రశ్న నిజమే కదా!

ADVERTISEMENT
Latest Stories