MLC Duvvada Srinivas Gets Doctorate

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పేరు వింటే ఎవరికైనా టక్కున గుర్తొచ్చే విషయం దివ్వెల మాధురితో నడుపుతున్న వ్యవహారం.

ఆమె కోసం కట్టుకున్న భార్యని పెళ్ళి వయసున్న కూతుర్లను వదిలేసిన దువ్వాడ శ్రీనివాస్, ఈ వ్యవహారం బయటకు పొక్కిన తర్వాత, ఇక నిశ్చింతగా దివ్వెల మాధురితో కాపురం పెట్టేశారు.

Also Read – ఒక్క హిట్ ప్లీజ్…

ఇద్దరూ చెట్టాపట్టాలు వేసుకొని తిరుమల శ్రీవారిని దర్శించుకుని వస్తున్నారు. టీవీ ఛానల్స్‌ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అప్పుడప్పుడు తమ ఆట పాటలతో జనాలను రంజింపజేస్తున్నారు కూడా.

కనుక వైసీపీ పేరు, తమ అధినేత జగన్‌ పేరుని ఇనుమడింపపజేస్తున్న దువ్వాడ శ్రీనివాస్‌ పలువిధాలుగా సమాజసేవ చేస్తున్నందుకుగాను ఆయనకు ‘డైలీ స్ప్రింగ్స్ యూనివర్సిటీ’ గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది.

Also Read – వింటేజ్ విరాట్…!

యధాప్రకారం దువ్వాడ శ్రీనివాస్, తన ప్రేయసి దివ్వెల మాధురిని వెంటబెట్టుకొని ఆ కార్యక్రమానికి వెళ్ళి నల్లకోటు, నల్లటోపీ పెట్టుకొని గౌరవ డాక్టరేట్ సర్టిఫికెట్ అందుకున్నారు.

ఆయన సమాజ సేవలను గుర్తించి గౌరవ డాక్టరేట్ ఇచ్చిన ‘డైలీ స్ప్రింగ్స్ యూనివర్సిటీ’ ఏ అమెరికాలోనో, బ్రిటన్‌లోనో లేదు. పక్క రాష్ట్రంలో సికింద్రాబాద్‌, రెజిమెంటల్ బజార్‌లో ఓ భవనంలో నాలుగో అంతస్థులో అందరికీ అందుబాటులోనే ఉంది.

Also Read – నమ్మలేం దొరా…!

వైసీపీలో అంబటి రాంబాబు, గోరంట్ల మాధవ్, పేర్ని నాని, ద్వారంపూడి చంద్రశేఖర్, కొడాలి నాని, వల్లభనేని వంశీ, విడదల రజని, రోజా, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, అనంత బాబు వంటివారు ఒక్కొక్కరూ ఒక్కో రంగంలో సమాజసేవ చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు.

ఇటీవల వైసీపీని వీడిన విజయసాయి రెడ్డి కూడా యధాశక్తిన చేసిన సమాజసేవ గురించి అందరికీ తెలుసు. కానీ వీరందరూ ఏ గుర్తింపుకి నోచుకోలేదు.




కనుక వీరందరికీ కూడా ఆయా రంగాలలో చేసిన సేవలకుగాను ‘గౌరవ డాక్టరేట్’ డిగ్రీలు ఈవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.