టెక్నాలజీ తో సమాజం ఎంత ముందుకెళ్తుందో చెప్పాల్సిన వైసీపీ టెక్నాలజీ తో ఎంత అరాచకం సృష్టించవచ్చో సమాజానికి చేసి చూపిస్తుంది. అలాగే ఒక రాజకీయ పార్టీగా, ఐదేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన వైసీపీ రాష్ట్రానికి పరిశ్రమలంటే మటన్ షాప్ లు, ఫిష్ మార్కెట్లు అంటూ కాలం వెళ్లదీసింది.
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ చేయని అద్భుత సాహసం వైసీపీ చేసింది, ఏ ముఖ్యమంత్రి తీసుకోని వినూత్న నిర్ణయం జగన్ తీసుకున్నారు అంటూ ఏపీలో పరిశ్రమలుగా ఫిష్ మార్ట్లు, మటన్ షాప్ లను ఆవిష్కరించారు జగన్.
అలాగే నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అంటే వాలంటీర్లు, ప్రభుత్వ వైన్ షాపులలో ఉద్యోగాలంటూ యువత భవిష్యత్ ని 5 వేలు, 10 వేలకు నిర్దేశిస్తూ వారి జీవితాన్ని మందుకు, మటన్ కొట్టుకు పరిమితం చేసారు.
ఆ దెబ్బకు 151 తో అధికార పక్షంగా ఉన్న వైసీపీ 11 తో ప్రతిపక్షంగా కూడా నిలబడలేకపోయింది. అయినా ఇప్పటికి ఆ వైసీపీ నాయకులకు ఇంకా ఆ ‘చేపల వేట’, ‘మటన్ నరకుడు’ అలవాటు పోయినట్టు లేదు.
వైసీపీ అధికారానికి దూరమై ప్రతిపక్ష హోదా కోసం ఆరాటపడుతున్నా ఇంకా వైసీపీ క్యాడర్ రప్ప రప్ప నరుకుతాం అంటూ అదే ధోరణిలో ఉండిపోయింది. ఇక వైసీపీ నాయకులు సైతం వర్షపు నీటిలో కూడా చేపల వేట కోసం వెతుకులాట కొనసాగిస్తూ,
అమరావతిలో పులస దొరుకుతుంది, కడప లో కొరమేలు చిక్కుతుంది అంటూ అదే చేపల వేట రాజకీయం చేస్తూ అక్కడే ఆగిపోతున్నారు. ఇప్పటికి కూడా వైసీపీ కి అమరావతిలో రాజధాని నిర్మాణాలు కనిపించడం లేదు, రప్ప రప్ప నరుకుతాం అంటూ పెట్టే పోస్ట్ ల వలన జరిగే నష్టం తెలియడం లేదు.
నాడు మూడు రాజధానులు అంటూనే రాష్ట్ర భవిష్యత్ ని నరికిన వైసీపీ ఇప్పుడు రప్ప రప్ప అంటూ టీడీపీ ని బెదిరిస్తోంది, అధికారులను హెచ్చరిస్తుంది. ఇక నాడు రాష్ట్రానికి పరిశ్రమల కోసం వేట కొనసాయించాల్సిన వైసీపీ నాయకులు నేడు రాష్ట్ర రాజధానిలో పులస చేపల వేట కొనసాగిస్తాం అంటూ చెప్పడం వైసీపీ రాజకీయం ఏ స్థాయికి పరిమితమయ్యిందో అర్ధమవుతుంది.






