సామాన్య ప్రజలు తమ ఇంటికి పోలీసులు వస్తే పరువు పోతుందని భయపడుతుంటారు. గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడితే తప్ప జీవితంలో పోలీస్ స్టేషన్ గడప తొక్కాలనుకోరు. కానీ రాజకీయ నాయకులు ఇందుకు పూర్తిభిన్నం.
కేసులంటే రాజకీయాలలో ‘వీరతాళ్ళు’ వంటివని, జైలుకి వెళ్ళివస్తే రాజకీయంగా మరోమెట్టుఎదగగలమని గట్టిగా నమ్ముతుంటారు.
కేసులు, అరెస్టులు, జైలు అంటే భయం లేదంటూనే కేసు నమోదవగానే ముందస్తు బెయిల్ కోసం, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పరుగులు తీస్తుంటారు. జైలుకి వెళ్ళాక అనారోగ్య కారణాలు చూపుతూ బెయిల్ కోసం పదేపదే పిటిషన్లు వేస్తుంటారు.
అయితే ఓ సినిమా విడుదలవుతున్నప్పుడు దర్శక నిర్మాతలు, నటీనటులు దానిని ఏవిదంగా ప్రమోట్ చేసుకుంటారో, అదేవిదంగా రాజకీయ నాయకులు కూడా తమపై కేసు నమోదవుతుందని తెలియగానే ఇటువంటి డ్రామాలతో రాజకీయంగా తమని తాము ప్రమోట్ చేసుకుంటారు.
ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఏ-4గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఈ ముందస్తు బెయిల్ ఎపిసోడ్ రక్తి కట్టించి, నేడు ధిల్లీ నుంచి విజయవాడ చేరుకొని ఈ కేసు విచారణకు హాజరవుతున్నారు.
వేలకోట్లు అవినీతికి పాల్పడి విచారణకు హాజరయ్యి తర్వాత అరెస్ట్ చేస్తే జైలుకి వెళ్ళబోతున్న మిథున్ రెడ్డికి గన్నవరం విమానాశ్రయంలో వైసీపీ శ్రేణులు జేజేలు, జిందాబాద్‌లు పలకడం, ఆయన కూడా వారికి అభివాదం చేస్తూ ఊరేగింపుగా సిట్ కార్యాలయానికి వెళుతుండటం చూస్తున్నప్పుడు, ఆయనేదో స్వాతంత్ర సమర పోరాటయోధుడన్నట్లు, దేశం కోసం పోరాడుతూ అండమాన్ జైలుకి వెళుతున్నారన్నట్లు అనిపిస్తుంది.
అయినా సామాన్య ప్రజల ఇంటికి పోలీసులు వస్తే పరువు, మర్యాదకు భంగం కలుగుతుందనుకుంటే, వైసీపీ నేతలు మాత్రం అవినీతి కేసులో విచారణకు హాజరవడం, జైలుకి వెళ్ళడం చాలా గొప్ప విషయంగా మార్చేశారు.
జనసేన శ్రీకాళహస్తి ఇన్‌ఛార్జ్ హత్య కేసులో అరెస్ట్ అయితే పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేసింది. కానీ ఇటువంటి అవినీతి కేసులో వైసీపీ నేతలు జైలుకి వెళితే, వారి అధినేత జగన్ వెళ్లి వారిని పరామర్శించి వస్తారు. పరామర్శ పేరుతో చేసే బలప్రదర్శన దానికి అధనం.
ఢిల్లీ నుండి ఎయిర్ ఇండియా విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఎంపీ మిధున్ రెడ్డి,
లిక్కర్ స్కామ్ కేసులో సిట్ విచారణకు హాజరుకానున్నారు pic.twitter.com/Iy4iNXLi6K— TV5 News (@tv5newsnow) July 19, 2025




