వైసీపీ కోడి కూయకపోతే కూటమి మేల్కోలేదట?

YSRCP Party Fees Reimbursement Protests

సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఒడిపోయినప్పటికీ 40 శాతం ప్రజలు తమకే ఓట్లు వేశారు కనుక నైతికంగా తామే విజయం సాధించామని జగన్‌ చెప్పుకున్నారు.

అలా ఆ ఓటమితో మొదలైన వైసీపీ నైతిక విజయ పరంపర నేటికీ కొనసాగుతూనే ఉంది. వైసీపీ నైతిక విజయాల జాబితాలో ఫీజ్ రీ ఇంబర్స్‌మెంట్‌ పోరాటాలు కూడా చేర్చుకుని గొప్పగా చెప్పుకుంటోంది.

ADVERTISEMENT

కూటమి ప్రభుత్వం ఫీజ్ రీ ఇంబర్స్‌మెంట్‌ కోసం రూ.600 కోట్లు విడుదల చేసిన్నట్లు ఈనాడు పత్రికలో వచ్చిన వార్త క్లిప్పింగ్‌ని వైసీపీ సోషల్ మీడియాలో ట్యాగ్ చేసి పెట్టుకొని, తమ పోరాటాల కారణంగానే హడావుడిగా నిధులు విడుదల చేసిందని, ఇది తమ నైతిక విజయమే అని వైసీపీ జబ్బలు చరుచుకుంది.

నిజానికి సంక్రాంతి పండుగ సమయంలోనే ఫీజ్ రీ ఇంబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయాలని, కాంట్రాక్టర్లకు పెండింగ్ బకాయిలు చెల్లించాలని సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

అప్పుడే ఫీజ్ రీ ఇంబర్స్‌మెంట్‌ కోసం రూ. 232 కోట్లు విడుదల చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ప్రకటించారు. ఆ తర్వాత బడ్జెట్‌లో మరో రూ.600 కోట్లు కేటాయించడంతో దానినీ ఇటీవల ప్రభుత్వం విడుదల చేసింది. త్వరలో మరో రూ.400 కోట్లు విడుదల చేస్తామని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ చెప్పారనే విషయం వైసీపీ పెట్టుకున్న న్యూస్ క్లిప్పింగ్‌లోనే చాలా స్పష్టంగా కనిపిస్తోంది.

జగన్‌ హయంలో చెల్లించకుండా ఎగవేసిన ఫీజ్ రీ ఇంబర్స్‌మెంట్‌ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెల్లిస్తోంది కనుకనే తొమ్మిది నెలల వ్యవధిలో రూ.1,232 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. ఇందుకు సిగ్గుపడాల్సిన వైసీపీ తమ పోరాటాలతోనే కూటమి ప్రభుత్వం మెడలు వంచి ఫీజ్ రీ ఇంబర్స్‌మెంట్‌ చెల్లించేలా చేశామని, ఇది తమ నైతిక విజయమేనని నిసిగ్గుగా చెప్పుకోవడం వైసీపీకే చెల్లు.

వైసీపీ పోరాటాలు చేయకపోతే కూటమి ప్రభుత్వం పనిచేయదని జగన్‌ అనుకోవడం నా కోడి కూయక పోతే లోకానికి తెల్లారదనుకున్నట్లే ఉంది కదా?

ADVERTISEMENT
Latest Stories