ప్రతిపక్ష రాజకీయ నాయకులకు పోలీస్ కేసులు మెడల్స్ వంటివి. ఏదో కేసులో పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే వారితో సరదాగా కబుర్లు చెప్పే నాయకులే, మీడియా రాగానే డ్రామా మొదలుపెట్టేస్తారు. అరెస్ట్ చేయనంత వరకు “మీ తాటాకు చప్పుళ్లకు భయపడము.. తుది శ్వాస వరకు పోరాటాలు ఆపేదేలే.. దమ్ముంటే అరెస్ట్ చేస్కోండని..” సవాలు విసిరే నేతలే అరెస్ట్ కాగానే ఇది అన్యాయం, అక్రమం, రాజకీయ కక్ష సాధింపు అని గగ్గోలు పెడుతుంటారు.
అరెస్ట్ కాబోతున్నామని ముందే పసిగడితే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లు వేస్తుంటారు. బెయిల్ లభిస్తే మళ్ళీ రెచ్చిపోతారు లేకుంటే అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారు. ఫార్ములా 1 రేసింగ్ కేసులో కేటీఆర్ ఇదే చేస్తున్నారు. బియ్యం బస్తాలు మాయం కేసులో పేర్ని నాని ఇదే చేస్తున్నారు.
Also Read – అప్పుడు సంబరాలు..ఇపుడు సందేశాలు..!
ఇద్దరిపై కేసులు నమోదవడంతో హైకోర్టుని ఆశ్రయించారు. ఈరోజు తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై ఇంకా విచారణ జరుగుతోంది. బహుశః కేసు వాయిదా పడితే ఇంట్లో కుటుంబ సభ్యులతో లేకుంటే జైల్లో ఖైదీలతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవలసి రావచ్చు.
ఇక్కడ పేర్ని నాని దంపతులతో సహా వారి గోదాముల మేనేజర్, ఇతర సిబ్బందిపై మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. పేర్ని నాను భార్య జయసుధాని ఏ-1గా, పేర్ని నాని ఏ-6గా పేర్కొన్నారు. జయసుధ బెయిల్ పొందగా, పేర్ని నాని కూడా నేడు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసి వచ్చే సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ సంపాదించుకున్నారు.
Also Read – ‘తమిళ’ దర్శకులు ‘తెలుగు’ వారిని మెప్పించలేరా..?
బెయిల్ లభిస్తే ‘ధర్మం, న్యాయం గెలిచిన్నట్లే ఆ రెండూ వారివైపే ఉన్నట్లే’ అనే ఫార్ములా ప్రకారం, నేడో రేపో పేర్ని నాని మీడియా ముందుకు వచ్చి మళ్ళీ కూటమి ప్రభుత్వంపై, మంత్రి కొల్లు రవీంద్రపై చెలరేగిపోవడం తధ్యం.
ఇప్పటికే వైసీపీ సొంత మీడియా ఆయనకు పక్క వాయిద్యాలు వాయించడం మొదలు పెట్టేసింది. కనుక కచేరీకి పేర్ని నానిదే ఆలస్యం.
Also Read – ఈ ఏడాది ఏపీకి అంతా శుభం… పండుగ చేసుకోవలసిందే!
‘తమ గోదాములో నుంచి అంత భారీ ఎత్తున బియ్యం మాయం అయితే, మేము దానికి డబ్బు చెల్లించేశాము కదా? ఇంకా ఎందుకు ఈ కేసు?నాపై రాజకీయ కక్ష సాధించుకోవాలంటే కేసులు పెట్టుకోండి.. జైలుకి కూడా పంపుకోండి. కానీ మద్యలో నా భార్యని ఎందుకు ఇరికిస్తున్నారు? అంటూ పేర్ని నాని అమాయకంగా మొహం పెట్టి అతితెలివిగా మాట్లాడుతున్నారు.
ఆ గోదాము యజమాని తన భార్య జయసుధే అని పేర్ని నాని స్వయంగా ఒప్పుకుంటున్నారు. అలాగే అంటే గోదాములో నుంచి బియ్యం దొంగతనం అవడం కూడా నిజమేనని ఒప్పుకుంటున్నారు. కానీ దానికి డబ్బు కట్టేసినందున ఆ బియ్యం దొంగతనం కేసు ఇప్పుడు రాజకీయ వేధింపు కేసుగా సెక్షన్స్ మారిపోతాయన్న మాట!