వైసీపీ మద్దతు మోడీ ప్రభుత్వానికే… నో డౌట్స్!

YS-Jagan_Narendra-Modiకాంగ్రెస్‌ మిత్రపక్షాల ‘ఇండియా’ కూటమి పార్లమెంటులో మోడీ ప్రభుత్వంపై అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టడంతో, పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణసంకటం అన్నట్లు మారింది దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతీయ పార్టీల పరిస్థితి!దీంతో బిజెపి మిత్రపక్షాలకు ఎటువంటి ఇబ్బందీ లేదు. అలాగే బిజెపిని వ్యతిరేకించే పార్టీలకు కూడా ఇబ్బంది లేదు. కానీ తటస్థంగా ఉండే పార్టీలకే ఇటువంటి సందర్భాలలో సంకటం ఏర్పడుతుంటుంది. వాటిలో ఏపీలోని టిడిపి, వైసీపీలు కూడా ఉన్నాయి.

ఆ రెండు పార్టీలు ఎన్డీయే కూటమిలో లేవు. బిజెపితో పొత్తులు లేవు. కనుక అవిశ్వాసతీర్మానాన్ని సమర్ధించవచ్చు లేదా వ్యతిరేకించవచ్చు. అదే… ఇప్పుడు పెద్ద ఇబ్బందిగా మారింది. వైసీపీ ప్రభుత్వం కేంద్రం దయాదాక్షిణ్యాల మీదే మనుగడ సాగిస్తున్నందున అది అవిశ్వాస తీర్మానాన్ని సమర్ధించలేదు. నేటికీ బిజెపితో పొత్తుల కోసం టిడిపి ఎదురుచూస్తోంది కనుక అదీ ఈ తీర్మానాన్ని సమర్ధించలేదు. ఈవిషయం ఆ రెండు పార్టీలకు, రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా బాగా తెలుసు.

ADVERTISEMENT

అయితే ఇదే అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, “మా పార్టీ ఈ అవిశ్వాసతీర్మానాన్ని వ్యతిరేకిస్తోంది. మరి దీనిపై టిడిపి వైఖరి ఏమిటో చెప్పాలని” చంద్రబాబు నాయుడుని నిలదీశారు. తద్వారా టిడిపిని రాజకీయంగా ఇరుకున పెట్టాలనే తాపత్రయమే కనిపిస్తోంది. అయితే 25 ఎంపీలను ఇస్తే ఢిల్లీ పెద్దల మెడలు వంచి ప్రత్యేకహోదా వగైరా అన్నీ సాధించుకువస్తామని ప్రగల్భాలు పలికి, గత నాలుగేళ్ళుగా అప్పులు, సీబీఐ కేసుల కోసం ఢిల్లీ పెద్దల ముందు తలదించుకొని బ్రతికేస్తూ, మళ్ళీ టిడిపిని నిలదీస్తుండటం సిగ్గుచేటు కదా?

అయినా ‘ఇండియా’ కూటమి పార్లమెంటులో తన శక్తిని, ఐకమత్యాన్ని చాటుకొని దేశప్రజల నమ్మకాన్ని పొందేందుకే కేంద్రంపై అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టిందని, కానీ దానిని నెగ్గించుకోలేమని దానికీ తెలుసు. అధికార, ప్రతిపక్షాలు పార్లమెంటు వేదికగా దీంతో ఓ రాజకీయ చదరంగం ఆడుతుంటే, ఇక్కడ ఏపీలో వైసీపీ కూడా దీంతో రాజకీయ చదరంగం ఆడాలని ప్రయత్నిస్తుండటం సిగ్గుచేటు కదా!

ADVERTISEMENT
Latest Stories