2.. 16… 67… 167 వైఎస్సాఆర్ కాంగ్రెస్ లెక్క ఇదట!

Ummareddy Venkateswarluకేంద్ర మాజీ మంత్రి, ఎమ్మెల్సీ, వైఎస్సాఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు 2014లో ఆ పార్టీ ఓటమికి కొత్త భాష్యం చెప్పారు. తిరుపతిలో జరిగిన పార్టీ శిక్షణ తరగతులలో ఆయన మాట్లాడుతూ 2014లో వైఎస్సార్‌సీపీ ఓడిపోయిందన్న టీడీపీ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.

ADVERTISEMENT

మొదటిసారిగా పార్టీ పెట్టినప్పుడు రెండు స్థానాల్లో విజయం సాధిస్తే రెండోసారి ఉప ఎన్నికల్లో 16 స్థానాలు కైవసం చేసుకున్నట్లు గుర్తు చేశారు. మూడవ పర్యాయం జరిగిన సాధారణ ఎన్నికల్లో ఏకంగా 67 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించినట్లు ఉమ్మారెడ్డి చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో 167 స్థానాల్లో విజయం సాధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు.

2014లో వైఎస్సాఆర్ కాంగ్రెస్ ఓడిపోకపోతే ఇప్పుడు ప్రతిపక్షంలో ఎందుకు ఉన్నట్టు? మరోవైపు వైఎస్సాఆర్ కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన 20 మంది ఇప్పటికే ఆ పార్టీని వీడి టీడీపీలో చేరిపోయారు. 2019లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన పరిస్థితి ఆ పార్టీది. లేకపోతే ఆ పార్టీ మనుగడే ప్రశ్నర్ధకం కావొచ్చు.

ADVERTISEMENT
Latest Stories