వైసీపీ నేతల అకృత్యాలు జగన్ పదేపదే చెప్పే “మారీచుడి” అవతారం మాదిరి నానాటికి రూపాలు మార్చుకుంటూ రాష్ట్రంలో సంచరిస్తున్నాయి. మొదట పత్రికల నుంచి దుష్ప్రచారాలను మొదలుపెట్టి ఆతరువాత వాటిని మీడియాకు.,అక్కడనుండి సామజిక మాధ్యమాలకు., ఇప్పుడు తాజాగా ఫేక్ ఫోన్ కాల్స్ స్థాయికి చేర్చారు.
జగన్ చంద్రబాబు పై చేస్తున్న దుష్ప్రచారాలు తార స్థాయికి చేరుకున్నాయి అనిపిస్తుంది. ఫేక్ ఫోన్ నెంబర్లతో ఫోన్లు చేస్తూ బాబు పై పెట్టిన తప్పుడు కేసుని ఒప్పు అనేలా ప్రజలలోకి తీసుకెళ్లడానికి వైసీపీ గ్యాంగ్ గట్టిగా ప్రయత్నిస్తుంది. 040 69131484 అనే నెంబర్ తో ఫేక్ ఫోన్ కాల్స్ చేస్తూ బాబు పై తప్పుడు వార్తలను వినిపిస్తూ ఒక వాయిస్ కాల్ వస్తుంది అనే వార్త ఇప్పుడు రాష్ట్రమంతా వ్యాపించింది.
రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో ఈ కాల్స్ వెళ్లడంతో వార్త బయటకు వచ్చింది. టీడీపీ నాయకులు వెంటనే ఈ విమర్శలను తిప్పికొట్టకపోతే వైసీపీ తన పనిని మరింత ముందుకు తీసుకువెళ్లే ప్రమాదం లేకపోలేదు. 40 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో బాబు ఎన్నడూ చేయలేని, చూడలేని దిగజారుడు రాజకీయాన్ని తన రాజకీయ ప్రస్థానం అంతిమదశలో ఎదుర్కోవడం అందరిలో చంద్రబాబు పట్ల సానుభూతిని కలిగిస్తుంది.
టీడీపీ పార్టీకి, నాయకత్వానికి, నేతలకు ఇది విషమ పరిస్థితే అని చెప్పకతప్పదు. తన అనుభవంతో ఇన్నాళ్లు హుందాతనముగా చేసిన రాజకీయాలు ఇప్పుడు ఇంతగా దిగజారిపోతున్న సమయంలో బాబు మానసిక ధెర్యంతో పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
పార్టీ నేతలు కూడా సమన్వయంతో ముందుకెళ్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వం చేస్తున్న ఈ తప్పుడు ప్రచారాలను తిప్పికొడుతూ తమ వాదనను ప్రజల ముందు ఉంచాల్సి ఉంటుంది. ఇన్నాళ్లు నాయకులకు పార్టీ అండగా ఉంది..ఇప్పుడు నేతలు పార్టీకి అండగా ఉండాల్సిన సమయం వచ్చింది. ఇక భారమంతా పార్టీ క్యాడర్ మీదే ఆధారపడి ఉంది. అనుభవం కలిగిన నేతలెందరో టీడీపీ పార్టీలో ఉన్నారు. వారందరు ఒకేతాటి పైకి వచ్చి పార్టీని, చంద్రబాబు నిజాయితీని ప్రజల ముందు బహిర్గత పరచాల్సి ఉంటుంది.



