సినీ పరిశ్రమలో మరోసారి డ్రగ్స్ ఉదంతం కలకలం రేపుతోంది. గతంలో రవితేజ సోదరుడు రఘు తదితరులపై సంచలన ఆరోపణలు వ్యక్తమైన తర్వాత కాస్త సర్ధుమణిగినట్లుగా కనపడిన డ్రగ్స్, మరోసారి ప్రకంపనాలకు కారణమైంది. హైదరాబాద్ లోని జీడిమెట్లలో గుట్టురట్టైన డ్రగ్స్ రాకెట్ లో సినీ నిర్మాత వెంకట సురేష్, అసిస్టెంట్ డైరెక్టర్ కిశోర్ నిందితులుగా పట్టుబడడం విశేషం.
ADVERTISEMENT
సదరు నిర్మాత, దర్శకుడు తరలిస్తున్న కేజీన్నర యాంటిఫిటమైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకుని, వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై యాంటీ డ్రగ్ ట్రాపికింగ్ యాక్ట్ ప్రకారం పలు సెక్షన్లపై కేసులు నమోదు చేసి, అనంతరం వారిని రిమాండ్ కు పంపించారు. డ్రగ్స్ రాకెట్ తో మరోసారి సినీ పరిశ్రమలోని వ్యక్తులకు సంబంధాలు వెల్లడి కావడంతో టాలీవుడ్ లో మరోసారి చర్చనీయంశంగా మారింది.
ADVERTISEMENT



