Congress BRS

ఏపీలో వైసీపీ చేస్తున్న నీచ రాజకీయాలతో ఎలాగూ కూటమి ప్రభుత్వానికి తిప్పలు తప్పడం లేదు. తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న రాజకీయాల వలన కూడా సమస్యలు ఎదురవుతుండటం చాలా బాధాకరమే.

విభజన తర్వాత ఏపీని పాలించిన చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఏనాడూ తెలంగాణ రాజకీయాలలో వేలు పెట్టలేదు. కానీ కేసీఆర్‌ పెట్టారు. నేటికీ బిఆర్ఎస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతూనే ఉంది.

Also Read – జగన్‌ ఆలోచింపజేయగలుగుతున్నారు మరి కూటమి నేతలు?

బిఆర్ఎస్ పార్టీ రాజకీయ అవసరాల కోసం ఏపీలో బనకచర్ల ప్రాజెక్టు గురించి తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది.

సముద్రంలో వృధాగా కలిసిపోతున్న నీటితో బనకచర్ల ప్రాజెక్టు చేపడతామని, దాని వలన ఎగువన ఉన్న తెలంగాణ రాష్ట్రానికి, రైతులకు ఎటువంటి నష్టం ఉండదని సిఎం చంద్రబాబు నాయుడు పదేపదే చెపుతున్నారు.

Also Read – చంద్రబాబు-రేవంత్ సమావేశం వైసీపీ, బీఆర్ఎస్‌ జీర్ణించుకోగలవా?

అయినా తెలంగాణ నీళ్ళని ఏపీ ప్రభుత్వం దోచుకుపోతోందని, కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం చేతులు ముడుచుకు చూస్తూ కూర్చుందంటూ రేవంత్ ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తోంది.

అది వితండవాదం చేస్తోందని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తెలిసి ఉన్నప్పటికీ దాంతోనే అది తెలంగాణ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోందని గ్రహించింది. కనుక బనకచర్లని అడ్డుకోవడానికి మేము విశ్వప్రయత్నాలు చేస్తున్నామని ప్రజలకు నిరూపించుకోక తప్పడం లేదు.

Also Read – ఇండోసోల్ నిర్వాసితులను జగనే కాపాడాలట!

తెలంగాణ కాంగ్రెస్‌ కూడా ప్రజలు తమని తప్పు పట్టకుండా ఉండేందుకు ఆయన వ్రాసిన లేఖలో విషయాలను ఎక్స్‌ మీడియాలో పోస్ట్ చేసింది.

ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్‌ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. “అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల టెండర్లను వెంటనే నిలిపివేయాలి. గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టు ఫ్రీ-ఫీజుబిలిటి రిపోర్ట్‌ను తక్షణమే తిరస్కరించాలి. ప్రాజెక్టుకు సంబందించిన డీపీఆర్‌ను వెంటనే అడ్డుకోవాలి.

డీపీఆర్ సమర్పించడం అంటే సీడబ్ల్యూసీ ఆమోదించినట్లే అవుతుందా?కేంద్ర జలవనరుల కమిషన్‌ తోపాటు గోదావరి-కృష్ణా నది బోర్డులు, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండానే ఈ ప్రాజెక్టు ప్రక్రియ ముందుకు సాగుతోంది, అని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేఖ వ్రాశారని తెలియజేసింది.

బనకచర్ల పేరుతో బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్ రాజేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దెబ్బకొట్టాలని ప్రయత్నిస్తోందని, ఈ లేఖ దానికి కౌంటర్‌ అని అర్దమవుతూనే ఉంది.

బనకచర్లతో తెలంగాణకు ఎటువంటి నష్టమూ లేదని సాగునీటి శాఖ మంత్రిగా చేస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియదనుకోలేము.

కనుక ఈ పేరుతో బిఆర్ఎస్ పార్టీ రాజకీయాలు చేస్తోందని, కనుక దాని దుష్ప్రచారం నమ్మవద్దని కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు నచ్చచెప్పుకొని ఉంటే బాగుండేది.

కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో ఆ పార్టీ వాదనలు సరైనవే అని ధృవీకరిస్తున్నట్లు వ్యవహరిస్తోంది.




దీని వలన బిఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించకపోగా బిఆర్ఎస్ ఉచ్చులో చిక్కుకుంటోంది. తెలంగాణలో ఆ రెండు పార్టీల మద్య మద్య రాజకీయ ఆధిపత్యపోరు ఉంటే అవి నేరుగా అమీతుమీ తేల్చుకోవాలి. కానీ మద్యలో బనకచర్లని పెట్టి పోరాటాలు చేసుకుంటూ ఆంధ్రా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం దేనికి?