dwarampudi chandrasekhar comments about pawan kalyanజనసేన ఆవిర్భావ సభలో పవన్ చేసిన ఒక్క ప్రకటన ఇంకా వైసీపీ నాయకులలో నిప్పు రాజేస్తూనే ఉన్నట్లుగా కనపడుతోంది. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ పేరును పవన్ ప్రత్యేకంగా ప్రస్తావించిన వైనం తెలిసిందే. అధికారం ఉందనే అహంకారంతో జనసేన నేతల మీద, వీర మహిళల మీద చేసిన దాడులను గుర్తు చేస్తూ ద్వారంపూడికి రానున్న ఎన్నికలలో ‘జనసేన’ సత్తా ఏంటో చూపిస్తామన్న వ్యాఖ్యలపై ద్వారంపూడి తాజాగా తీవ్రంగా స్పందించారు.

రానున్న ఎన్నికలలో పవన్ ఎక్కడ నుండి పోటీ చేసినా, అక్కడ తానే ఇంచార్జ్ బాధ్యతలు తీసుకుని పవన్ ను ఓడించి తీరుతా అంటూ సవాల్ విసిరారు ద్వారంపూడి. జనసేన నేతలను, కార్యకర్తలను కూడా పవన్ మోసం చేస్తున్నారని, వారిని అడ్డం పెట్టుకొని టీడీపీ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకు రావడానికే పవన్ ఈ పొత్తుల డ్రామా మొదలు పెట్టారని., ఇందులో రాష్ట్ర శ్రేయస్సుని కాదు., చంద్రబాబు శ్రేయస్సుని పరిగణలోకి తీసుకున్నారని త్వరలోనే ఈ విషయం జనసేన కార్యకర్తలు కూడా అవగతం అవుతుందని ద్వారంపూడి జనసేన పార్టీపై., పవన్ పై విరుచుకుపడ్డారు.

ద్వారంపూడి వ్యాఖ్యలకు ఈ సారి జనసేన నాయకులు గట్టిగానే బదులిచ్చారు. నీకు ఇంత అహంకారామా ద్వారంపూడి? పవన్ ను ఓడించండం సంగతి పక్కనుంచితే, ముందు నువ్వు గెలిచి చూపించు? వ్యక్తిగతంగా పవన్ ను విమర్శించడం మీద పెట్టిన శ్రద్ధలో ఒక్క శాతం అయినా కాకినాడ నియోజకవర్గ అభివృద్ధిలో పెట్టుంటే నిన్ను ఎన్నుకున్న ప్రజలకు ఎంతో మేలు జరిగేదని నాదెండ్ల మనోహర్ కూడా అంతే స్థాయిలో మండిపడ్డారు.

అభివృద్ధిని పక్క దారి పట్టించి జనసేన నేతలపై., మహిళలపై కులాల పేరుతో దూషణలు చేయడం మీకు తగునా? ఒకరిని ఓడించడం., గెలిపించడం మీ చేతులలోనే ఉంటే 2014 ఎన్నికలలో అంత భారీ తేడాతో మీరు ఎందుకు ఓడారో చెప్పాలని జనసేన నేతలు ద్వారంపూడిని నిలదీస్తున్నారు. ప్రస్వామ్యంలో గెలుపు – ఓటమి రెండిటిని సమాన దృష్టి తో చూడగలిగిన వాడే నిజమైన నాయకుడు అవుతాడని, ఆ విషయం ఈ వైసీపీ నాయకులు తెలుసుకోవాలని జనసైనికులు ద్వారంపూడికి కాస్త మసాలా దట్టించి మరి కౌంటర్లు ఇస్తున్నారు.