ఫ్లాష్… ఫ్లాష్… త్వరలో మార్కెట్ లోకి 250 రూపాయల నోటు?

250-rupees-noteనోట్ల రద్దు నిర్ణయంతో ఏర్పడిన గందరగోళం ఇప్పటివరకు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. దీని నుండి ఇంకా తేరుకోకముందే మీడియా వర్గాలలో అనేక వార్తలు హల్చల్ చేస్తుండడంతో ప్రజలు మరింత ఆందోళన చెందే పరిస్థితి నెలకొంటోంది. ముఖ్యంగా 2000 రూపాయల నోటు విషయంలో అనేక వార్తలు ప్రచారంలో ఉండడంతో… ఏది నిజమో, ఏది అసత్యమో తెలియక తికమకమవుతున్నారు. 500, 1000 నోట్ల మాదిరే ఏ క్షణమైనా 2000 రూపాయల నోటు కూడా రద్దు కానుందన్న సంకేతాలు వ్యక్తమైన నేపధ్యంలో… రోజులు గడుస్తున్న కొద్దీ అవి బలపడుతున్నాయి.

ADVERTISEMENT

తాజాగా ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడు ఆడిటర్ అయిన గురుమూర్తి చెప్పిన సంగతులు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం చలామణిలో ఉన్న 2000 రూపాయల నోటు కూడా రద్దు చేస్తారని, అలాగే కొత్తగా 250 రూపాయల నోటును తీసుకువస్తారని, దేశంలో 500 రూపాయల నోటే అతి పెద్ద కరెన్సీ నోటు కానుందని చెప్పిన సంగతులు చర్చనీయాంశమయ్యాయి. కేవలం రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఇచ్చిన సూచనల మేరకే అర్ధంతరంగా 2000 రూపాయల నోటును తీసుకు వచ్చారని, ఇక నుండి 100, 250, 500 రూపాయల నోట్లే ముద్రణ జరుగుతుందని, ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు.

ఒక సాధారణ వ్యక్తిగా గురుమూర్తి ఈ వ్యాఖ్యలు చేసుంటే పెద్దగా ప్రాధాన్యత దక్కి ఉండేది కాదు. కానీ, మోడీకి అత్యంత ఆప్తుడి హోదాలో ఈ వ్యాఖ్యలు చేయడంతో… ఖచ్చితంగా భవిష్యత్తులో అమలయ్యే సంకేతాలు కనపడుతున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రద్దయిన 500, 1000 రూపాయల నోట్లను 2000 రూపాయల నోటుతో మార్చుకున్న నల్లకుభేరులకు ఇలాంటి సమాచారం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఓ పక్కన దేశవ్యాప్తంగా లక్షలు, కోట్లల్లో ఈ కొత్త కరెన్సీ పట్టుబడుతుండడం, మరో పక్కన త్వరలోనే ఇది కూడా రద్దవుతుందన్న సమాచారంతో 2000 రూపాయల నోటు చూస్తే భయపడే పరిస్థితి నెలకొంది.

ADVERTISEMENT
Latest Stories