40 టీడీపీ ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ తో టచ్ లో ఉన్నారట!

40 TDP MLAs behind Pawan Kalyanజనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ గవర్నమెంట్ పై తాను చేసిన అవినీతి ఆరోపణలపై రోజుకో మాట మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది. గుంటూరు సభలో తీవ్ర ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్, మరుసటి రోజే తన వద్ద ఆధారాలు ఏమి లేవని, అంతా అనుకుంటున్నారు జాగ్రత్త పడమని మాత్రమే చెప్పానని నిన్న ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ చెప్పారు.

అయితే దీనిమీద తీవ్రమైన విమర్శలు రావడంతో పవన్ కళ్యాణ్ మళ్ళీ మాట మార్చి అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఒక జాతీయ ఛానల్ తో మాట్లాడుతూ 40 మంది టీడీపీ ఎమ్మెల్యేలు తన వద్దకు వచ్చి చంద్రబాబు అవినీతి గురించి చెప్పి ఎంతో బాధపడ్డారని, దీనితో చాలా సార్లు దాని గురించి చంద్రబాబుని వారించానని ఆయన చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT

అయితే చంద్రబాబు తనను పట్టించుకోలేదు అన్నారు పవన్ కళ్యాణ్. ఇదే సమయంలో కేంద్రం వెంటనే స్పందించి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పై వస్తున్న ఆరోపణలపై నిజనిర్ధారణ కమిటీ ఒకటి వెయ్యాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. మరి ఏమైనా రుజువులు ఉంటే ఆయనే కోర్టుకు వెళ్ళొచ్చుగా?

ADVERTISEMENT
Latest Stories