వైరల్ అవుతోన్న కొత్త 500 రూపాయల నోటు ఫోటో!

500-rupees-noteకొత్త కరెన్సీ నాణ్యతను పరీక్షించి వాటి వీడియోలను సోషల్ మీడియాలో పెడుతూ బిజీగా గడుపుతున్న ఔత్సాహికులు మరో వీడియోను తెచ్చారు. 2000 రూపాయల కరెన్సీ నోటను నీటిలో ముంచి, అది రంగు, రూపాన్ని కోల్పోలేదని నిరూపించింది నేటితరం యువత. తాజాగా 500 రూపాయల నోటు వంతు వచ్చింది. అయితే, అది యాదృచ్ఛికంగానే జరగడం గమనార్హం.

శంకరమఠం ప్రాంతానికి చెందిన హైకోర్టు న్యాయవాది సాయికృష్ణ ఆజాద్‌, గురువారం నాడు ఏటీఎం నుంచి డ్రా చేసిన 500 నోటును (నంబర్ 5 ఏసీ 377217) బయటకు తెస్తుండగా, చేతిలోంచి జారి నీళ్లలో పడిపోయింది. వెంటనే ఆ నోటును బయటకు తీసి, ఫ్యాన్ గాలికి ఆరబెట్టగా, ఇదిగో ఈ ఫోటోలో చూపిస్తున్నట్లుగా మారిపోయింది. రంగు వెలిసి ఆనవాళ్లు కోల్పోవడంతో పాటు, జాతిపిత గాంధీ బొమ్మతో, ఇతర అక్షరాలు సైతం పాడైపోయాయి.

ADVERTISEMENT

దీంతో ఇంతకీ అది అసలు నోటా? లేక నకిలీదా? అని ఆజాద్ విస్తుపోయారు. పాడైపోయిన 500 రూపాయల నోటు చిత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో 2 వేలను పరీక్షించినట్టు 500ను పరిశీలించరాదన్న నీతి ఈ ఘటనతో తెలుస్తోందని, 500 నోట్లతో నీటి ప్రయోగాలు వద్దని, చేస్తే నోటు చెల్లకుండా పోతుందని సోషల్ మీడియా సలహా ఇస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories