సన్నాసుల్లారా… తమాషా చేస్తున్నారా మీరందరూ..!

Actor Sivaji, Actor Sivaji Suicide, Actor Sivaji Suicide Warning, Actor Sivaji Suicide Threat,  Actor Sivaji Suicide Attempt, Telugu Actor Sivaji Suicide ఆంధ్రప్రదేశ్ కు దక్కాల్సిన ‘స్పెషల్ స్టేటస్’పై ‘ప్రత్యేక హోదా సాధన సమితి’ అధ్యక్షుడు, సినీ హీరో శివాజీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మరోసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఏకరువు పెట్టారు శివాజీ. ఎప్పుడూ మోడీ సర్కార్ ను మాత్రమే టార్గెట్ చేసే శివాజీ, ఈ సారి చంద్రబాబు ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి తీసుకువచ్చే వ్యాఖ్యలు చేసారు.

ప్రత్యేక హోదా అంటే అంత చిన్న చూపా? ఆ రోజు గడ్డితిని హామీలు ఇచ్చా? ఏమి నాటకాలు ఆడుతున్నారు? కేంద్రంలో ఒక్కొక్కరూ ఒక్కొక్క స్టయిల్ లో… కేంద్రానికి ఏపీ ఒక్కటేనా? అంటూ ఎటకారపు మాటలు మాట్లాడుతున్నారు. మనుషులు కాదు మీరు… మీకు భావితరాల ఉసురు తగులుతుంది… సన్నాసుల్లారా… తమాషాలు చేస్తున్నారా మీరందరూ? ఆంధ్రప్రదేశ్ ను రెండుగా విడగొట్టిన సన్నాసులు మీరు… ఏ ఒక్కడికీ కనీస అర్హత కూడా లేదు… అంటూ తీవ్ర స్వరంతో స్పందించారు.

ADVERTISEMENT

ఆంధ్రప్రదేశ్ ప్రజలతోటి ఆడుకుంటారా? ఈ సందర్భంగా ఇంకొకటి కూడా చెబుతున్నాను చంద్రబాబుకు… సార్ వినండి… ప్రత్యేక హోదా విషయంలో ప్యాకేజీలతో సర్దుకుపోవాలని చూస్తే, డైరెక్టుగా మీ ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటాను. వింటున్నారా సార్! మీ ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటాను. చరిత్రలో నిలిచిపోవాలనుకుంటున్నాను. మీరు చరిత్ర హీనులవుతారా? చరిత్ర పురుషులవుతారా? మీరే నిర్ణయించుకోండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు హోదా సాధన సమితి అధ్యక్షుడు శివాజీ.

ADVERTISEMENT
Latest Stories