వేసవిలో స్టార్ల సందడి!

Allu Arjun Naa Peru Surya  - Mahesh Babu Bharat Ane Nenu - boxoffice Clashఇంకా సంక్రాంతికి రెండు నెలల సమయం ఉంది అయితే ఇప్పుడే వేసవి బెర్త్లు కంఫర్మ్ చేస్కునే పనిలో ఉన్నారు మన స్టార్ హీరోలు. వేసవి అంటే స్కూలు పిల్లలకు సెలవుల పండగ దానితో మన సినిమా జనాలు సంక్రాంతి సీజన్‌ తర్వాత దృష్టి పెట్టేది సమ్మర్‌పైనే. రామ్‌చరణ్‌ ‘రంగస్థలం’ మర్చి చివరి వారంలో రాబోతుంది.

ADVERTISEMENT

రజనీకాంత్‌, శంకర్‌ కలయికలో రూపొందుతున్న చిత్రం ‘2.0’ జనవరిలో సినిమా విడుదల ఉంటుందని ఇప్పటిదాకా చెప్పిన చిత్రబృందం ఇప్పుడు ఏప్రిల్‌లో విడుదల చేసే ప్రయత్నంలో ఉందంట. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్‌ 13న సినిమాను విడుదల చేస్తారు. మరో వైపు అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య… నా ఇల్లు ఇండియా’ మరియు మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ ఏప్రిల్ 27న డేట్ ప్రకటించారు.

అయితే రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావడం అంత తేలిక కాదు. ఈ సినిమాలు ఖఛ్చితంగా ఒకేరోజున రావు అయితే ఏ సినిమా పోస్టుపోన్ అవుతాదో చూడాలి మరి. మరో వైపు నాగార్జున – రామ్‌గోపాల్‌వర్మ కాంబినేషన్‌లో రూపొందబోతున్న సినిమా కూడా ఏప్రిల్‌లో వచ్చే అవకాశం ఉంది.

అయితే ఆ సినిమా ఇంకా సెట్స్‌పైకి రానప్పటికీ ఏప్రిల్‌ విడుదల చేస్తామని ఇటీవల వర్మ అన్నారు. సినిమా షూటింగ్ మొదలు పెట్టడం అనుకున్న టైంకి పూర్తి చెయ్యడం రామ్ గోపాల్ వర్మకి వెన్న తో పెట్టిన విద్య. కావున ఈ సినిమా కూడా సమ్మర్ కి వచ్ఛే అవకాశం బాగా ఉంది. మొత్తానికి మందు వేసవి సరికొత్త వినోదాన్ని పంచడానికి మన స్టార్లు రెడీ అవుతున్నారు!

ADVERTISEMENT
Latest Stories