ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేసే చట్ట సవరణ బిల్లుకి నిన్న లోక్‌సభ ఆమోదం తెలిపింది. నేడు రాజ్యసభలో ఈ బిల్లుపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా తెలంగాణ బిజేపి ఎంపీ విలక్ష్మణ్, కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నదీముల్ హక్, ఆమాద్మీ పార్టీ సంజయ్ సింగ్ ఇంకా పలు పార్టీల సభ్యులు అమరావతి బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
వారిలో బిజేపి ఎంపీ విలక్ష్మణ్ మాట్లాడుతూ, “ఏపీకి ముఖ్యమంత్రిగా చేసిన పిల్ల కాంగ్రెస్ నాయకుడు దేశానికి రాజధాని ఉంటుంది కానీ రాష్ట్రాలకు ఉండదంటూ పిచ్చి మాటలు మాట్లాడుతుంటే చూసి ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. మళ్ళీ ఆయనే కొత్తగా ‘మావిగన్’ అనే కొత్త రాజధానిని ప్రతిపాదించి నవ్వులపాలవుతున్నారు.
కానీ చంద్రబాబు నాయుడుగారు రాజధాని కోసం భూములిచ్చి ఐదేళ్ళు నరకం అనుభవించిన రైతులు, మహిళలు, మాతృమూర్తుల కోసం అమరావతిని నిర్మిస్తున్నారు. ఈ బిల్లుకి సంపూర్ణ మేము మద్దతు ఇస్తున్నాము,” అని అన్నారు.
కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి కూడా నాడు జగన్ హయంలో రాజధాని రైతుల పట్ల ఎంత క్రూరంగా వ్యవహరించారో వివరిస్తూ అమరావతి బిల్లుకి మద్దతు తెలిపారు.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన అధికార తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నదీముల్ హక్ కూడా ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతే ఉండాలంటూ మద్దతు ఇచ్చారు.
ఆమాద్మీ పార్టీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ, “అమరావతితో రైతులకు, ప్రజలకు ఉన్న అనుబంధం గురించి టీడీపి ఎంపీ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడి వివరించినదంతా విన్నాక ఇది కేవలం రాజధాని మాత్రమే కాదని ప్రజల భావోద్వేగాలకు సంబందించినదని అర్థం చేసుకొని మద్దతు ఇస్తున్నాను,” అని అన్నారు.
ఇలా మన రాష్ట్రంతో, మన పార్టీలతో, వాటి రాజకీయాలతో ఎటువంటి సంబంధమూ లేని ఇతర రాష్ట్రాల ఎంపీలు అమరావతికి మద్దతు ఇస్తుంటే, ఆంధ్రాకు చెందిన వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి “అమరావతి బిల్లుని వ్యతిరేకిస్తూ సభ నుంచి వాకవుట్ చేస్తున్నా,’ అంటూ ప్రకటించి వెళ్ళిపోవడం సిగ్గుచేటు.
జగన్ నిన్న ప్లాన్-బి మావిగన్ అంటూ చెప్పిన మాటల గురించి ఆంధ్రా ప్రజలు మాత్రమే కాదు ఇరుగు పొరుగు రాష్ట్రాల ప్రజలు, రాజకీయ నాయకులు కూడా విని నవ్వుకుంటున్నారని వి.లక్ష్మణ్, రేణుకా చౌదరి మాటలతో స్పష్టమైంది. అంతేగాదు…. ఇదివరకు మూడు రాజధానులు గురించి చెప్పుకొని ఢిల్లీలో నవ్వుకున్నవారు ఇప్పుడీ ‘మావిగన్ రాజధాని’ గురించి చెపుకొని నవ్వుకుంటున్నారు. ఢిల్లీలో కూడా వైసీపీ నేతలు తలెత్తుకోలేని పరిస్థితి కల్పించారు వారి అధినేత జగన్! తలెక్కడ పెట్టుకోవాలి మహాప్రభో?
నిన్న సోషల్ మీడియాలో చూశాను… కొత్తగా “Ma-Vi-Gun” అని ఫార్మ్ చేశారు.
ప్రజలు నవ్వుకుంటున్నారు… ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు.
–@drlaxmanbjp #Amaravati #MAVIGUN pic.twitter.com/3ddo5nXvsu
— M9 NEWS (@M9News_) April 2, 2026




