ఏపీ చరిత్రలో చిరస్థాయిగా ఆ ఇద్దరూ…

Amaravati declared Andhra Pradesh capital

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పలు రాష్ట్రాల విభజన జరిగి కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. కానీ ఏ రాష్ట్రానికి లేని రాజధాని సమస్య ఆంధ్రప్రదేశ్‌కి కలిగింది.

హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని మొదలు విశాఖ రాజధాని వరకు జరిగిన ఎపిసోడ్స్ అన్నీ ప్రజలకు తెలుసు. కనుక ఆ రీవైండింగ్ అవసరం లేదు.

ADVERTISEMENT

కానీ రాష్ట్రానికి ఫలానా రాజధాని అని నిర్దిష్టంగా లేకపోతే ‘నేను ఎక్కడ కుర్చీ వేసుకొని కూర్చుంటే అదే రాజధాని’ అనే గొప్ప నాయకులు మనకున్నారు.

కనుక ఈసారి అమరావతికి పార్లమెంట్ చేత రాజధాని ముద్ర వేయించేందుకు సిఎం చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.

రాష్ర విభజన చట్టంలో పదేళ్ళపాటు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని స్పష్టంగా పేర్కొంది. ఆ గడువు ముగిసి రెండేళ్ళు కాబోతోంది. కనుక ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలోనే ‘ఏపీ రాజధాని అమరావతి’ అని కేంద్ర ప్రభుత్వం బిల్లు పెట్టబోతోంది.

ఏ తేదీ నుంచి అమరావతిని రాజధానిగా గుర్తింపునివ్వాలో తెలియజేయాలని కేంద్ర హోంశాఖ కోరగా రాష్ట్ర విభజన జరిగిన 2024, జూన్ 2వ తేదీనే ఖరారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.

కేంద్ర హోంశాఖ కోరిన విధంగా రాజధాని ఎంపికకి అనుసరించిన ప్రక్రియ, అమరావతి ప్రాంతంలో చేపట్టిన రాజధాని నిర్మాణ కార్యక్రమాలు, అక్కడ ఏర్పాటవుతున్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు, జాతీయ బ్యాంకులు, నిర్మాణ పనుల పురోగతి తదితర సమాచారం అంతా నోటిఫికేషన్‌ రూపంలో కేంద్రానికి పంపింది.

వాటిపై కేంద్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదం తెలిపిన తర్వాత ఈ నెలాఖరు నుంచి మొదలయ్యే పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలలో బిల్లు ప్రవేశపెడుతుంది. దీనిపై వైసీపీకి తప్ప మరెవరికీ అభ్యంతరాలు ఉండవు కనుక ఏకగ్రీవంగా ఆమోదం పొందడం ఖాయమే.

ఈ బిల్లుకి పార్లమెంట్‌, రాష్ట్రపతి రాజముద్రలు పడితే భవిష్యత్‌లో ఎప్పుడైనా ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చినా జగన్‌ తనకు నచ్చిన జిల్లాలో కుర్చీ వేసుకొని కూర్చోగలరేమో కానీ ఏపీ రాజధానిని మార్చలేరు. మార్చే ప్రయత్నం చేస్తే కేంద్ర ప్రభుత్వం, న్యాయస్థానాలు అడ్డుకుంటాయి.

రాష్ట్రానికి కొత్త రాజధాని నిర్మిండమే చాలా కష్టం. కానీ సిఎం చంద్రబాబు నాయుడు నిర్మించబోతే దానికీ జగన్‌ కారణంగా ఇన్ని సమస్యలు, అవరోధాలు ఎదుర్కోవలసి వస్తోంది.

జగన్‌ సృష్టించిన ఈ సమస్యలన్నిటినీ అధిగమించి చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధాని నిర్మించి చూపబోతున్నారు.

కనుక ఏపీ చరిత్రలో చంద్రబాబు నాయుడు, జగన్‌ ఇద్దరి పేర్లు శాశ్వితంగా నిలిచిపోతాయి. ఒకరు భవ్యమైన రాజధాని నిర్మాతగా, మరొకరు చరిత్రహీనుడుగా మిగిలిపోతారు. ఈ క్రెడిట్ జగన్‌ వద్దనుకున్నా వదిలించుకోలేరు.

ADVERTISEMENT
Latest Stories