గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధిని క్యారంటైన్ చేయడంతో ఇక ఏపీకి రాజధాని ఉండదా.? ఏపీ అభివృద్ధికి మార్గాలు మూసుకుపోయాయా.? అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి.
దానికి తోడు వైసీపీ వై నాట్ 175 నినాదం అటు కూటమిలోని, ఇటు రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే వారిలోను ఆందోళనను రేకెత్తించాయి. అయితే వైసీపీ నినాదాలన్ని పగటి కలలే, వైసీపీ నాయకుల ఆశలన్నీ అత్యాశాలే అన్నట్టుగా ఏపీ ప్రజలు 175 నుంచి వైసీపీ ని 11 కు తీసుకొచ్చారు.
దీనితో ఇక రాష్ట్ర రాజధానిగా అమరావతి పునర్నిర్మాణం మొదలయ్యింది. ఈసారి ఎలా అయినా అమరావతికి రాజధాని కళ తీసుకురావాలని, ఇక ముందు రాబోయే ప్రభుత్వాలు కూడా అమరావతినే రాజధానిగా కొనసాగించేలా చట్టాలు తేవాలని ముఖ్యమంత్రి బాబు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆ దిశగానే అమరావతి నిర్మాణాలు పరుగులు పెడుతున్నాయి. అందులో భాగంగానే రాజధానికి అవసరమైన మౌలిక సదుపాయాలు రోడ్లు, డ్రైనేజ్ లు మొదలుకుని రైల్వే, ఎయిర్ లైన్స్ వరకు అని వసతులను అమరావతికి అందుబాటులోకి తెచ్చేందుకు అమరావతి విస్తరణపేరుతో పనులు శర వేగంగా జరుగుతున్నాయి.
నవ నగరాల నిర్మాణాలతో మొదలైన అమరావతి ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ సాగుతుంది. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం అమరావతి లో 5 వేల ఎకరాలతో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మాణానికి సిద్దమయ్యింది.
ఇందుకు గాను రాజధాని ప్రాంతమైన తుళ్లూరు మండలం లోని పెదపరిమి ప్రాంతం ను పరిశీలనలోకి తీసుకుంటుంది. ఇక్కడ కొండలు, నీటి ప్రవాహాలు లేకపోవడంతో ఈ ప్రాంతాన్ని కూటమి ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకున్నట్టు సమాచారం.
అయితే టెక్నికల్ ఫీజిబిలిటీ నివేదిక వస్తే ఈ నిర్మాణాల విషయంలో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. అయితే గతంలో ఓ సంస్థ ఇచ్చిన నివేదిక పై CRDA అభ్యంతరాలు వ్యక్తం చేయగా ఇపుడు మరో సంస్థకు ఆ బాధ్యతలు అప్పగించారు.
గత ప్రభుత్వ హయాంలో అధికారులతో ఉద్యమాలు, ప్రభుత్వాలతో పోరాటాలతో తన ఉనికి కోసం ఆరాటపడిన అమరావతి నేడు అభివృద్ధితో, ఉపాధి కల్పనలతో దూసుకుపోతుంది. ఇప్పటికే ఎడ్యుకేషనల్ హబ్ గా డవలప్ అయిన అమరావతి రానున్న రోజులలో ఐటీ, క్వాంటం వాలీ నిర్మాణాలతో టెక్నాలజీ లో కూడా తన సత్తా చాటేందుకు సిద్దమవుతుంది.
ముఖ్యమంత్రి జగన్ అమరావతి నిర్మాణానికి గత ఐదేళ్లల్లో కనీసం తన వంతుగా, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క ఇటుక కూడా పేర్చలేకపోయారు. కానీ అదే అమరావతిలో నేడు 5 వేల ఎకరాలతో అంతర్జాతీయ విమానాశ్రయానికి అడుగులు పడుతున్నాయి. దీనితో రానున్న నాలుగేళ్లు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ‘అమరావతి’ పేరు గట్టిగానే వినపడేలా కనిపిస్తుంది.




