amaravati-farmers-worry-on-land-acquisition--govt-change

విజనరీ కన్నా విధ్వంశానికే బలమెక్కువ అనేలా గత ఐదేళ్ల వైసీపీ పాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలను భయపెట్టిన మాట వాస్తవం. అయితే నాడు టీడీపీ ప్రభుత్వాన్ని నమ్మి, ముఖ్యమంత్రి బాబు విజనరీకి తలవంచి తమ పంట పొలాలను రాజధాని నిర్మాణం కోసం, రాష్ట్ర భవిష్యత్ పురోగాభివృద్ది కోసం సుమారు 33 వేల ఎకరాల భూమిని పెట్టుబడిగా పెట్టారు.

అయితే నాడు ఒక ప్రభుత్వ విజనరీ ని నమ్మి భూములిచ్చిన అమరావతి రైతులకు వైసీపీ ప్రభుత్వం విధ్వంసాన్ని పరిచయం చేసింది. తమ పిల్లల భవిష్యత్ కోసం ఉంచుకున్న భూములను, తమ వారసత్వ సంపద కింద తర తరాలుగా వస్తున్న ఆస్తులను రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం త్యాగం చేసిన రైతుల త్యాగాలకు వైసీపీ కుల ముద్ర వేసింది.

Also Read – చంద్రబాబు-రేవంత్ సమావేశం వైసీపీ, బీఆర్ఎస్‌ జీర్ణించుకోగలవా?

నాడు వైసీపీ ఎంచుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో అమరావతి రైతుల గుండెలు ఆగాయి, వారి కుటుంబాలు ఉద్యమాల పేరుతో గత ఐదేళ్లు రోడ్లమీదే తమను న్యాయం కావాలి అంటూ ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నారు. అయితే వారి కన్నీటి ఉసురో, వైసీపీ విధ్వంసాల పాపమో కానీ 2024 ఎన్నికలలో కూటమి అధికారంలోకి, వైసీపీ పాతాళానికి పడింది.

అయితే నాడు వైసీపీ చేసిన మూడు రాజధానుల గాయాలను పూడ్చేపనిలో ఉన్న బాబు, అమరావతి నిర్మాణాలను శర వేగంగా పూర్తి చేసి అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇటు అమరావతి రైతులకు తానిచ్చిన హామీని నిలబెట్టుకోవాలని గట్టి పట్టుదలాగా ఉన్నారు.

Also Read – జగన్‌ ఆలోచింపజేయగలుగుతున్నారు మరి కూటమి నేతలు?

అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వంతో తత్సబంధాలను కొనసాగిస్తూ అమరావతి నిర్మాణానికి కావలసిన అన్ని అనుమతులను, నిధులను ఎప్పటికప్పుడు రాబట్టుకోగలుగుతున్నారు. ఇక రాజధానిలోనే తన ఇంటి గృహప్రవేశానికి కూడా ముహూర్తం పెట్టిన బాబు, తన ఇంటి గృహ ప్రవేశంతో పాటే రాజధాని అమరావతి గృహ ప్రవేశాలు కూడా జరిగిలే ప్రణాళికలు వేస్తున్నారు.

దీనితో తమ ఐదేళ్ల మనోవేధనకు, మానసిక క్షోభకు నేడు న్యాయం జరుగుతుంది అనే ఆశ ప్రతి రాజధాని రైతు కుటుంబాల కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఒక నిర్ణయం అదే ప్రాంత రైతుల మదిలో ఎన్నో చిక్కు ప్రశ్నలను, మరెన్నో అనుమానాలను రేకెత్తిస్తుంది.

Also Read – ఇండోసోల్ నిర్వాసితులను జగనే కాపాడాలట!

రాజధాని విస్తరణ పేరుతో కూటమి ప్రభుత్వం మరో 40 వేల ఎకరాల భూసేకరణకు సిద్ధపడుతున్న ఈ తరుణంలో అమరావతి రైతు కుటుంబాలలో మళ్ళీ అదే ఆందోళన, మళ్ళీ అవే భయాలు. రాబోయే ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి వస్తే అన్న ఒకే ఒక్క ప్రశ్న రాజధాని రైతులలో అలజడిని సృష్టిస్తుంది.

గత ఐదేళ్ల వైసీపీ అరాచకాన్ని కళ్లారా చూసిన రైతులు, ఇప్పుడు అమరావతి పై వైసీపీ కి తోడు సాక్షి చేస్తున్న దుర్భాషలను గమనిస్తున్న రైతు కుటుంబాలు కూటమి ప్రభుత్వాన్ని నమ్మి తమ భూములను ఇచ్చేందుకు వెనకాడుతున్నారు. రేపటి రోజున ప్రభుత్వాలు మారితే తమ కుటుంబాల భవిష్యత్ అంధకారంలోకి వెళ్లిపోవడం ఖాయం అన్న వాస్తవాన్ని అక్కడి ప్రాంత భూ యజమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ప్రభుత్వాలతో పోరాడే శక్తి కానీ, సాహసం కానీ ఇక పై చేసేందుకు తాము సిద్ధంగా లేమని, తమ ఆవేదనను ప్రభుత్వాలు కూడా అర్ధం చేసుకోవాలని, టీడీపీ, వైసీపీ రాజకీయ చదరంగంలో తాము బలిపశువులు కదలచుకోలేదంటూ అక్కడి ప్రాంత రైతులు తమ గోడును మీడియా ముఖంగా కూటమి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు.

ప్రభుత్వం ముందుగా తీసుకున్న భూములను అభివృద్ధి చేసిన తరువాత మాత్రమే తమ భూ సేకరణ చేపట్టాలని, లేకుంటే ఈ భూములు కూడా గతంలో మాదిరే అటు వ్యవసాయానికి, ఇటు అభివృద్ధికి నోచుకోకుండా అరణ్యంలా మారుతుంది అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు అమరావతి రైతులు.




అయితే వారి వేదనలో, వారి ఆందోళనలో న్యాయం ఉందని, అమరావతి రైతుల డిమాండ్ లో ధర్మం ఉందనేది వాస్తవం. వారికి కూటమి ప్రభుత్వం మీద ఉండే నమ్మకం కంటే కూడా వైసీపీ పార్టీ మీద ఉండే భయమే ఎక్కువ అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మరి వారి భయాన్ని పోగొట్టి, గతంలో మాదిరే ఎటువంటి వివాదాలను తావీయకుండా బాబు రైతుల నుంచి భూసేకరణ చెయ్యగలుగుతారా.? వైసీపీ అలా చేయనిస్తుందా.?