
ఏపీ రాజధాని అమరావతిలో రూ.1,126.51 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 47 అంతస్తుల ఐకానిక్ టవర్స్‌లో రాష్ట్ర సచివాలయం ఏర్పాటు కాబోతున్న సంగతి తెలిసిందే.
Also Read – భారత్‌కు శాపంగా మారిన అమెరికా, చైనా?
అమరావతి ప్రీ-ప్లాన్డ్ సిటీ కనుక ముందుగానే ఎక్కడ ఏ భవనాలు, ఎంత విస్తీర్ణంలో నిర్మించాలి, వాటిలో ఏయే కార్యాలయాలు ఏర్పాటు చేయాలి?ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల గృహ సముదాయాలు, రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరియు విద్యుత్ వ్యవస్థ, రవాణా, పార్కులు .. ఇలా ప్రతీ ఒక్కటీ ముందుగానే ప్లాన్ చేసుకొని నిర్మించుకొంటుండటం వలన అత్యాధునికమైన, అత్యంత సౌకర్యవంతమైన నగరంగా అమరావతి ఉద్భవించబోతోంది.
దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల రాజధాని నగరాలలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు ఉంటాయి. కానీ నగరం ఏర్పడిన తర్వాత అవన్నీ ఏర్పాటు అయినందున వివిద ప్రాంతాలలో ఏర్పాటయ్యాయి. కానీ అమరావతి ప్రీ ప్లాన్డ్ సిటీ కనుక దానిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట ఏర్పాటు కాబోతున్నాయి.
Also Read – అసెంబ్లీ వద్దు మీడియానే ముద్దా.?
వాటన్నిటికీ కలిపి ఒకే సచివాలయం, వాటిలో పని చేసే ఉద్యోగుల కోసం నివాస సముదాయాలకు రాష్ట్ర ప్రభుత్వం 22.53 ఎకరాలు కేటాయించింది.
కేంద్ర సచివాలయం నిర్మాణం కొరకు రూ.1,458 కోట్లు, ఉద్యోగుల నివాస సముదాయం కొరకు రూ.1,329 కోట్లు కలిపి మొత్తం రూ.2,787 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖాతటర్ అధికారిక ఉత్తర్వులను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు అందించారు.
Also Read – జగన్ దండయాత్రలే వైసీపీకి శాపంగా మరబోతున్నాయా?
కేంద్ర ప్రజా పనుల విభాగం ఆధ్వర్యంలో 5.53 ఎకరాలలో అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ (కేంద్ర సచివాలయం), 17 ఎకరాలలో ఉద్యోగుల గృహ సముదాయం నిర్మాణాలు జరుగుతాయి.
అమరావతిలో ఇప్పటికే సీఆర్‌డీఏ కార్యాలయంతో సహా పలు భవనాల నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. 2028 లోగా రాజధాని నిర్మాణ పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకొని పనులు చేస్తున్నారు.