ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం ఏవిదంగా ఉండాలో సిఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడో ఊహించారు. వాటిని ఫోటోలు, వీడియోలలో చూపిస్తే వైసీపీ నేతలు గ్రాఫిక్స్, భ్రమరావతి, శ్మశానం అని ఎగతాళి చేశారు.
నేటికీ అమరావతి అంటే వైసీపీకి చిన్న చూపే. అందుకే సాక్షి మీడియాలో ‘వేశ్యల రాజధాని’ అని చెప్పించి పైశాచికానందం పొందారు.
కానీ సిఎం చంద్రబాబు నాయుడు మనసులో ఉన్న అమరావతి ఊహాచిత్రం మెల్లమెల్లగా ప్రజల కళ్ళ ముందు సాక్షాత్కరించబోతోంది.
అమరావతిలో 39, 47 అంతస్తులతో 5 టవర్స్ నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. వీటిలో సమీకృత సచివాలయం, ముఖ్యమంత్రి, మంత్రుల కార్యాలయాలు, వివిద శాఖాధిపతుల కార్యాలయాలు వగైరా ఉంటాయి.
మొత్తం రూ. 4,688.82 కోట్లు వ్యయంతో నిర్మించబోయే ఈ 5 టవర్ల నిర్మాణం కొరకు సీఆర్‌డీఏ టెండర్లు పిలిచి, ప్రీ బిడ్డింగ్ ప్రక్రియ ముగించిన తర్వాత నేడు ఈ కాంట్రాక్టులు దక్కించుకున్న కంపెనీల పేర్లను, వివరాలను ప్రకటించింది.
సమీకృత సచివాలయం కలిగిన జీఏడీ టవర్ రూ.882.47 కోట్లు విలువగల నిర్మాణ కాంట్రాక్టుని ప్రముఖ నిర్మాణ సంస్థ ఎన్‌సీసీ దక్కించుకుంది.
రూ.1,487.11 కోట్లు విలువకలిగిన టవర్ 1,2 నిర్మాణ కాంట్రాక్ట్ పనులను షాపూర్ జీ పల్లోంజీ కంపెనీ దక్కించుకుంది.
రూ. 1,303.85 కోట్లు విలువకలిగిన టవర్ 3,4 నిర్మాణ కాంట్రాక్ట్ పనులను ఎల్ అండ్ టీ కంపెనీ దక్కించుకుంది.
ఈ మేరకు తక్షణమే ఈ మూడు కంపెనీలకు నిర్మాణ బాధ్యతలు అప్పగించేందుకు అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి. సురేష్ కుమార్ సీఆర్‌డీఏ కమీషనర్‌ని ఆదేశించారు.
ఇప్పటికే అమరావతిలో షాపూర్ జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ కంపెనీలు వివిద భవనాలు నిర్మించి ఉన్నందున, వాటి యంత్రాలు, ఇంజనీర్లు, కార్మికులు అందరూ అందుబాటులో సిద్దంగానే ఉన్నారు. కనుక ప్రభుత్వపరంగా అన్ని అనుమతులు లభించగానే వీలైనంత త్వరగా ఈ ఐకాన్ టవర్స్ నిర్మాణ పనులు మొదలుపెడతాయి.మూడేళ్ళలో మరో రెండు మూడు నెలల్లో ఈ టవర్స్ నిర్మాణ పనులు మొదలుపెడితే 2026-27 మద్య ఈ 5 టవర్స్ నిర్మాణాలు పూర్తయ్యే అవకాశం ఉంది.




