అమరావతి రైతుల ధర్మసందేహాలు…? జగన్ సిద్ధమా.?

Amaravati vs YSRCP: Farmers Question Jagan’s Stand

అమరావతి vs వైసీపీ అన్నటుగా సాగుతున్న రాజధాని వివాదం నానాటికి జఠిలమవుతుంది. వైసీపీ తానూ పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అంటూ అమరావతి పై ఇప్పటికి అదే విష ప్రచారాన్ని వ్యాప్తి చేస్తూ ముందుకెళుతుంటే, మీ బెదిరింపు రాజకీయాలకు తలవంచేది లేదు అంటూ అమరావతి రైతులు వెనక్కితగడం లేదు.

తాజాగా మీడియా ముందుకొచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ కూడా ఇదే విష ప్రచారాన్ని కొనసాగిస్తూ అమరావతి కృష్ణా నది భూగర్భంలో నిర్మిస్తున్నారని, అసలు అమరావతిలో కనీస మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో లేవని, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి లక్షల కోట్లు అవసరమని,

ADVERTISEMENT

ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితికి అది మోయలేని భారమంటూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి అమరావతి రైతులను మోసం చేసేందుకు సిద్ధమయ్యారు అంటూ రాష్ట్ర రాజధాని అమరావతి పై వైసీపీ స్టాండ్ ఏంటో చెప్పకనే చెప్పేసారు.

అయితే జగన్ ప్రకటనలతో అమరావతి రైతులలో కొన్ని ధర్మసందేశాలు మొదలయ్యాయి..ఆ సందేహాలను ఆయా ప్రాంత రైతులు జగన్ కు సంధిస్తున్నారు, మరి వైసీపీ కానీ వైఎస్ జగన్ కానీ వారి సందేహాలకు జవాబులు చెప్పగలరా.? వాటిలో కొన్ని ప్రశ్నలు…

* అమరావతి, నిర్మాణాలకు అనువైన ప్రాంతం కాకపోతే వైసీపీ ప్రభుత్వం పేదలకు అక్కడ భూకేటాయింపులు ఎందుకు చేసింది.? అంటే ఆ పేద ప్రజలను ముంపు ప్రాంతంలో ముంచుదామని జగన్ ఉద్దేశమా.? జగన్ కు పేదల పై ప్రేమ లేదని అర్థమా.? లేక పేదల ఇళ్ళు వరదలలో మునిగిపోయినా పర్లేదన్న భావనలో వైసీపీ ఉందా.?

* అమరావతి లో కనీస మౌలిక సదుపాయాలు లేవు అంటూ ఇప్పుడు చెపుతున్నారు అంటే గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో అసలు అమరావతిలో ఎటువంటి అభివృద్ధి చెయ్యలేదని ఒప్పుకున్నట్టేనా.? జగన్ మూడు రాజధానుల భాగంగా అమరావతి కూడా ఒక రాజధానే. అయినా కూడా జగన్ తన ప్రభుత్వ హయాంలో అమరావతిలో చేసింది శూన్యమే అనుకోవాలా.? ఐదేళ్లు చేతిలో అధికారాన్ని పెట్టుకుని శాసన రాజధానిలో జగన్ చేసిన అభివృద్ధి ఏమిటి.?

* రాజధాని అమరావతిలో ప్రభుత్వం తీసుకున్న భూములలో ఎక్కువ భాగం ఎస్సీ, ఎస్టీల భూములున్నాయి, పొద్దున్న లేస్తే నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ మాట్లాడే జగన్ ఇప్పుడు తన ప్రకటనలతో ఆ వెనుబడిన జాతులను మరింత వెనక్కి నెట్టాలని చూస్తున్నారా.? అమరావతి అభివృద్ధి ఫలాలను ఎస్సీలకు, ఎస్టీలకు అందకూడదనేది జగన్ ఆలోచనా.?

* అమరావతి పై ఇంత విషం చిమ్మే మీరు, మీ ఐదేళ్ల ప్రభుత్వ హయాంలో ఇక్కడి నుంచే ఎందుకు పాలించారు.? ప్రభుత్వాన్ని నడిపించారు.? రాజధానిగా అమరావతిని వ్యతిరేకిస్తూ ఇక్కడి ప్రాంత విధ్వంసానికి కంకణం కట్టుకున్న మీరు ఈ ప్రాంత ప్రజల ఓట్లు ఎలా అడుగుతారు.? ఇక్కడ వైసీపీ ని ఎలా పోటీలో ఉంచుతారు.?

* అమరావతిని కాదని విశాఖను రాజధానిగా ప్రకటించినప్పటికీ ఆ ప్రాంత ప్రజలు సైతం ఎన్నికలలో వైసీపీ ని ఛీ కొట్టారు, రాజధానిగా విశాఖను తిరస్కరించారు, అయినా కూడా ఇప్పటికి వైసీపీ ప్రజా తీర్పును గౌరవించకుండా తమ పార్టీ గౌరవాన్ని ఎందుకు దిగజార్చుకుంటున్నారు.?

* రైతుల సమస్యల మీద ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్న జగన్ నాడు తన ప్రభుత్వ హయాంలో ఇదే రైతులను నడి రోడ్డు మీదకు లాగలేదా.? ఇక్కడి ప్రాంత రైతులను వారి కుటుంబాలను పైడ్ ఆర్టిస్ట్ లంటూ హేళన చెయ్యలేదా.? నాడు కనీసం రైతుల ఖాతాలో కౌలు సొమ్ము జమచేయడానికి కూడా మనసు రాని జగన్ ఇప్పుడొచ్చి రైతు సమస్యలు అంటూ రాజకీయం చేస్తున్నారు. అసలు వైసీపీ ఆ అర్హత ఉందా.?

నిజంగా అమరావతి పై వైసీపీ స్టాండ్ ఏంటి అనేది చెప్పాలంటే జగన్ ఎక్కడో మీడియాలోనే, ప్యాలస్ లోనో కూర్చొని మాట్లాడడం కాదు, ఇక్కడి ప్రాంత అభివృద్ధి గురించి, ఇక్కడి రైతు సమస్యల గురించి, అమరావతి భవిష్యత్ గురించి ఒక సభ నిర్వహించాలని,

ఆ సభ అమరావతిలోనే ఉండాలని, అలా ఇక్కడి నుంచి మాట్లాడే దమ్ము వైసీపీ కి ఉందా.? అందుకు జగన్ సిద్ధమా.? అంటూ అమరావతి రైతులు జగన్ అండ్ కో ని ఉద్దేశించి కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి వారి ఈ ధర్మసందేహాలకు జగన్ బదులు చెప్పగలరా.?

ADVERTISEMENT
Latest Stories